దాడి పై హైకోర్టులో జగన్ పిటిషన్…..

Jagan's petition in high court ... Trending Andhra

విశాఖ విమానాశ్రయంలో జరిగిన దాడి ఘటనపై ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ హైకోర్టును ఆశ్రయించారు. ఏపీ ప్రభుత్వ వైఫల్యం వల్ల దాడి జరిగిందని పిటిషన్‌లో జగన్ పేర్కొన్నారు.

Image result for Attack On Jagan Photos

తన హత్యకు కుట్ర జరిగిందని, కేంద్ర దర్యాప్తు సంస్థతో ఈ ఘటనపై విచారణ చేయించాలని కోర్టును జగన్ కోరారు. ఈ పిటిషన్ రేపు విచారణకు రానుంది. ఈ కేసులో ప్రతివాదిగా చంద్రబాబు పేరును జగన్ చేర్చడం గమనార్హం. ప్రభుత్వం కేసును తప్పుదోవ పట్టించేలా వ్యవహరిస్తోందని జగన్ పిటిషన్‌లో పేర్కొన్నారు.

Image result for Attack On Jagan Photos

ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి వైవీ సుబ్బారెడ్డి ఓ పిటిషన్ దాఖలు చేశారు. అంతకు ముందు ఓ పిల్ దాఖలైంది. ఈ రెండు పిటిషన్లపై విచారణ వాయిదా పడటంతో జగనే స్వయంగా పిటిషన్ దాఖలు చేశారు.