పవన్ నిర్మాతలని ఆదుకున్న తారక్ ..!

ntr , jr ntr , trendingandhra

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో అజ్ఞాతవాసి సినిమా తీసి నష్టాలపాలైన హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధినేత రాధాకృష్ణకు అరవింద సమేత మంచి లాభాలు తెచ్చి పెడుతుంది. త్రివిక్రం డైరక్షన్ లో ఎన్.టి.ఆర్ హీరోగా వచ్చిన అరవింద సమేత సినిమా మొదటి షో నుండి పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తుంది.

NTR, Aravinda Sametha,Trendingandhra

అజ్ఞాతవాసి వల్ల త్రివిక్రం కూడా అపవాదాలు మూటకట్టుకున్నాడు. హాలీవుడ్ సినిమా లార్గో వించ్ కాపీ వర్షన్ అంటూ అజ్ఞాతవాసిపై చాలా విమర్శలు వచ్చాయి. వాటిననంటిని తొలగిపోయేలా అరవింద సమేతతో సూపర్ హిట్ అందుకున్నాడు త్రివిక్రం. ఆ సినిమా మిగిల్చిన నష్టాలను అరవింద సమేతతో పూడ్చుకుంటున్నాడు నిర్మాత రాధాకృష్ణ.

ntr, Aravinda Sametha ,TrendingAndhra

అక్టోబర్ 11న రిలీజైన అరవింద సమేత సినిమా 14 రోజుల్లో 90 కోట్ల పైగా షేర్ రాబట్టింది. ఈ సినిమా ఇప్పటికే 120 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందని తెలుస్తుంది. సినిమా కొన్న డిస్ట్రిబ్యూటర్స్ అంతా లాభాలు తెచ్చుకున్నారు.

#JrNtrSavedProducerRadhaKrishna #HaarikaAndHassineCreation #Trivikram