కౌశల్ పై కాలు దువ్వుతున్న కత్తిమహేష్….!

kathi mahesh , kathi mahesh comments on Kaushal , trendingandhra

బిగ్‌బాస్ షో చివరి అంకానికి చేరుకుంది. ఎన్నో విపత్కర పరిస్థితులను ఎదుర్కొని ఐదుగురు పార్టిసిపెంట్స్ ఫైనల్ బరిలో నిలిచారు. కౌశల్, తనీష్, దీప్తి, గీతా మాధురి, సామ్రాట్, గీతా మాధురి ఫైనల్స్‌కు చేరిన వారిలో ఉన్నారు. ఇప్పుడిక నిర్ణయం అంతా ప్రేక్షకుల చేతుల్లోనే. ప్రేక్షకుల నుంచి ఎవరికి ఎక్కువ ఓట్లు పడితే వారే విజేత.
bigg boss telugu season 2 , trendingandhra
ఇలాంటి పరిస్థితుల్లో కౌశల్ గురించి బిగ్‌బాస్ సీజన్ 1 పార్టిసిపెంట్ కత్తి మహేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హౌస్‌లో ఇటీవల గొడవ జరిగిన నేపథ్యంలో ‘కౌశల్ అంతా కోల్పోయాడు.. అతన్ని హౌస్ నుంచి బయటకు గెంటేయండి’ అని ట్వీట్ పెట్టారు కత్తి మహేష్. శనివారం నాని కౌశల్‌ని ప్రశ్నించిన నేపథ్యంలో ‘చాలా పేలవమైన, విసుగుపుట్టించే సమాధానం చెప్పాడు కౌశల్. బిగ్‌బాస్ చరిత్రలోనే చాలా చిరాకు తెప్పించే వ్యక్తి’ అని ట్వీట్ చేశారు. తాజాగా మరో అడుగు ముందుకేసి సంచలన ట్వీట్ పెట్టారు. ‘కౌశల్ బిగ్‌బాస్ 2లోనే చాలా విసుగు తెప్పించే వ్యక్తి. ఒకవేళ అతను బిగ్‌బాస్ 2 గెలిస్తే మనమెంత ఇడియట్స్ అనేది ప్రూవ్ అవుతుంది’ అని కత్తి మహేష్ పేర్కొన్నారు.

kathi mahesh , trendingandhra

తాను దీప్తి నల్లమోతు తరుఫున క్యాంపెయిన్ నిర్వహిస్తానని ఫేస్‌బుక్ ద్వారా మహేష్ తెలిపారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన ఓ యువతి ‘ప్రజలు ఎవరినైతే ఇష్టపడతారో వాళ్లనే మీరెందుకు టార్గెట్ చేస్తారు’ అని ప్రశ్నిస్తే.. ప్రజల ఒపీనియన్‌తో తనకు సంబంధం లేదని.. తన దారిలో తాను వెళతానని స్పష్టం చేశారు. గతంలో పవన్ కల్యాణ్‌పై ఇలాగే కత్తి మహేష్ సంచలన వ్యాఖ్యలు చేసి ,ఫాన్స్ చేత చివాట్లు తిన్నాడు … . తాజాగా కౌశల్‌పై ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై ఆంతర్యమేమై ఉంటుందని నెటిజన్లు
చర్చించుకుంటున్నారు. చూడాలి మరి దీనిపై కౌశల్ ఆర్మీ ఏ విధంగా రెస్పాండ్ అవుతుందో చూడాలి .