రణ్ బీర్ తో సహజీవనం పై కత్రినా స్పందన….!

katrina kaif comments on her relation with ranbir kapoor,trendingandhra

కత్రినా కైఫ్ బాలీవుడ్ లో ఒక ఊపు ఊపిన కథానాయక. ఈమె బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా పలు సినిమాల్లో నటించింది. హిందీ లో అగ్రకథానాయకిగా కొనసాగిన కత్రినాకు ఇప్పుడు ఆఫర్స్ తగ్గాయి. ఎన్నో ఆశలు పెట్టుకున్న తగ్స్ అఫ్ హిందుస్థాన్ దారుణంగా విఫలమైంది. ఒకప్పుడు కత్రినా కోసం కుర్రకారు పిచ్చెక్కిపోయేవారు కానీ ఇపుడు ఆ పరిస్థితి లేదు. కత్రినా క్రేజ్ బాగ్ అతగ్గిపోయింది. ఇపుడు ఆమె ఆశలన్నీ షారుక్ జీరో సినిమా పైన్ ఉన్నాయ్. డిసెంబర్ 21 న విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగం కత్రినా తన ప్రేమ కోసం చెప్పింది. ఎప్పుడు థన్ పెర్సనల్స్ విషయాలని మీడియా ముందు చెప్పని కత్రినా ఈ సరి మాత్రం రణ్ బీర్ తో తన ప్రేమ సంభంధం గురించి చెప్పుకొచ్చింది కత్రినా . అప్పట్లో ఇద్దరు సహజీవనం కూడా సాగించారు. వీరిద్దరు కలిసి ఒక అందమైన ఇంటిని కూడా తీసుకున్నారు. ఏం జరిగిందో ఏమో కాని ఇద్దరు విడిపోయారు. రణ్ బీర్ పేరు ప్రస్థావించకుండానే ఆయనతో బ్రేకప్ వల్ల తనకు చాలా మంచి జరిగిందని బ్రేకప్ తర్వాత తాను ఎన్నో విషయాలను నేర్చుకున్నాను చాలా జాగ్రత్తగా ఉండటం నేర్చుకున్నాను అంది. బ్రేకప్ ను నాకు దేవుడు ఇచ్చిన ఆశీర్వాదంగా భావిస్తున్నాను అంటూ కూడా చెప్పింది. ప్రస్తుతం ఎవరినైనా ప్రేమిస్తున్నారా అంటూ ప్రశ్నించగా కత్రీనా నవ్వేసింది. రణ్ బీర్ మాత్రం ప్రస్తుతం అలియా భట్ తో ప్రేమలో ఉన్నాడు. వీళ్ళిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు అనే వార్తలు కూడా బి టౌన్ లో గట్టిగా వినిపిస్తుంది.