మాజీ మంత్రిని మోసం చేసిన కెసిఆర్…

kcr,cm kcr ,trendingandhra

తెలంగాణాలో ఎన్నికలు సమీపిస్తున్న నేపధ్యంలో అక్కడ సీట్ల విషయంలో రచ్చ కొనసాగుతుంది. నిన్నటి వరకు అధికారంలో ఉన్న తెరాస నేతలు విజయం కోసం గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. 105 మంది అభ్యర్ధులను ప్రకటించి ఎన్నికలకు వెళ్తున్న కెసిఆర్ బిజెపి నియోజకవర్గాల్లో మాత్రం సీట్లను ప్రకటించలేదు. ఇందులో ముషీరాబాద్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు అభ్యర్ధిని ప్రకటించలేదు.

kcr,trendingandhra

గత ఎన్నికల్లో ఇక్కడ పోటి చేసి విజయం సాధించిన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు లక్షణ్ కోసమే ఈ సీటు ఆపారని ఆరోపణలు ఉన్నాయి. ఈ సీటుని మాజీ హోం మంత్రి నాయని నరసింహారెడ్డి ఆశిస్తున్నారు. లేదా తన అల్లుడికి అయినా ఈ సీటు ఇవ్వాలని కోరుతున్నా నాన్చుతూ వస్తున్న కెసిఆర్ బిజెపికి సహకరించడం కోసమే అని అంటున్నారు. గత ఎన్నికల్లో నాయని పోటి చేయలేదు. అయినా ఎమ్మేల్సితో మంత్రి పదవి ఇచ్చారు కెసిఆర్. ఇప్పుడు అనూహ్యంగా ఆయన ఈ సీటుపై పట్టుబట్టడంతో కెసిఆర్ కి ఇబ్బందికర పరిణామంగా మారింది.

#kcrCheatedFormerMinisterNayiniNarasimhaReddy #FormerMinister #NayiniNarasimhaReddy