లగడపాటి చాటింగ్ గుట్టు రట్టు చేసిన కేటీఆర్…ఇప్పుడిదే హాట్ టాపిక్

KTR hot dismisses lagadapati survey with screenshots,trendingandhra

సర్వేల స్పెషలిస్ట్ గా పేరొందిన మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కు కేటీఆర్ షాక్ ఇచ్చారు. తనతో టీఆర్ ఎస్ గెలుస్తుందని లగడపాటి చేసిన చాట్ హిస్టరీ ని షేర్ చేశారు. దీంతో లగడపాటి సర్వే కొత్త మలుపు తిరిగింది. తాజాగా కేటీఆర్ పేల్చిన బాంబ్ తో లగడపాటి కి ఇప్పుడు ఏం చెయ్యాలో అర్ధం కావట్లేదు.
లగడపాటి సర్వేరాష్ట్రంలో పెను దుమారమే రేపింది. ఊరించి ఊరించి వెల్లడించిన సర్వే ఫలితాలు కూటమికి అనుకూలంగా ఉన్నాయన్న లగడపాటి తన సర్వే సంచలనాన్ని బయటపెట్టారు. ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న ఎన్నికల గురించి తాను సర్వే ఫలితాలు వెల్లడించనంటూనే…కాంగ్రెస్ సారథ్యంలోని ప్రజాకూటమికి ఆధిక్యం వచ్చే చాన్స్ ఉందని ఆయన పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే దీన్ని టీఆర్ఎస్ పార్టీ నేత మంత్రి కేటీఆర్ లగడపాటి సర్వే పై వస్తున్న వార్తలను ఖండించారు. అనంతరం ఆయన సంచలన చాటింగ్ వివరాలను బయటపెట్టారు. లగడపాటి సర్వే ఫలితం తమకు అనుకూలంగా ఉందని సాక్షాత్తు లగడపాటి తనతో చాట్ చేశారని అయితే ఇప్పుడు చంద్రబాబు ఒత్తిడి ఫలితమే సర్వే ఫలితం మార్చి చెప్పటం అని పేర్కొంటూ గత నెల ఇదే రాజగోపాల్ టిఆర్ఎస్ పార్టీ కి 65 నుంచి 70 సీట్లు వస్తాయని ఎస్ఎంఎస్ పంపినట్లు మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా తెలపడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.
లగడపాటి రాజగోపాల్ తన సర్వే ఫలితాలను వెల్లడించిన అనంతరం మంత్రి కేటీఆర్ తన ట్వీట్ లో లగడపాటిది సర్వే కాదు చిలక జోస్యం అని ఆయన పేర్కొన్నారు. అయితే మరికొద్ది సేపటికి గతంలో లగడపాటికి తనకు మధ్య జరిగిన వాట్సాప్ చాటింగ్ వివరాలను ఆయన పంచుకున్నారు. గత నెల 20వ తేదీన టీఆర్ఎస్ పార్టీకి 65 నుంచి 70 సీట్లు వస్తాయంటూ లగడపాటి రాజగోపాల్ తనకు పంపిన మెసేజ్ ను మంత్రి కేటీఆర్ ట్విట్టర్ లో షేర్ చేశారు. తాము గెలిచే సీట్లను చంద్రబాబు ఒత్తిడి ఫలితంగా మార్చుకున్నారని పేర్కొంటూ కేవలం చంద్రబాబు కుట్రను ప్రజలకు తెలియజేసేందుకు లగడపాటి తనకు పంపిన మెసేజ్ ను షేర్ చేయాల్సి వస్తుందని అన్నారు. అయితే నవంబర్ 20 నాటికి తనకు పంపిన చాటింగ్ లో ఫలితాల పరిస్థితి ఉన్నదని ముఖ్యమంత్రి మరియు టీఆర్ఎస్ పార్టీ ఎలక్షన్ తనకు అనుకూలంగా మార్చుకునే తీరు గురించి తనకు పూర్తి అవగాహన ఉన్నదని లగడపాటి అన్నారు. లగడపాటి తన అంచనాలకు మించి టీఆర్ఎస్ పార్టీ సీట్లు గెలుచుకున్న తనకు ఆశ్చర్యం లేదన్నారు. ఇదే విషయం జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ నిరూపితమైందని లగడపాటి మంత్రికి పంపిన చాట్ లో తెలిపారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే అసలు విషయం వెల్లడించాల్సి వస్తోందని పేర్కొంటూనే కేటీఆర్ పేల్చిన బాంబు సంచలనంగా మారింది. మొత్తానికి లగడపాటిని, అలాగే చంద్రబాబును ఇరికించి కేటీఆర్ లగడపాటి చాటింగ్ గుట్టు రట్టు చేశారు.