లగడపాటి షాకింగ్ సర్వే ..ఏపీ సీఎం జగనే ..!

Lagadapti Survey,Ys Jagan,Trendning andhra

 

ఆంధ్రా ఆక్టోపస్ గా పిలవబడే లగడపాటి కి రాష్ట్ర రాజకీయాలపై మంచి పట్టు ఉంది . తన సర్వేలతో తెలుగు వారిని ఆశ్చర్యపరిచే కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ మరోసారి అందరికి షాక్ ఇచ్చాడు . ప్రతి సారి ఎన్నికల ముందు రాష్ట్రం లో లగడపాటి సర్వేలు చేయిస్తాడు . ఈ సర్వేలపై తెలుగు ప్రజలల్లోనే కాదు , జాతీయ స్ధాయిలో కూడా ఆయనకు విశ్వసనీయత ఉంది. 2014 సంవత్సరంలో లగడపాటి చేయించిన సర్వే ఫలితాలు ఆ ఎన్నికల్లో నిజమైయ్యాయి .

ప్రస్తుతం ఎన్నికలకి ఏడాది ముందే సర్వే చేయించాడని తెలుస్తుంది . కానీ ఆ ఫలితాలు ఇప్పుడే ప్రకటించకుండా ఎన్నికలు ముగిసిన తరువాత ఫలితాలకు ముందు ప్రకటిస్తానని చెప్పాడు .కానీ ఆ సర్వే ఫలితాలు ఇవే అని , ఇప్పుడు ఒక వార్త హల్ చల్ చేస్తుంది . ఈ సర్వేలో వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధినేత వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి 2019 లో ముఖ్యమంత్రి కావడం ఖాయమని లగడపాటి తన సర్వేలో తేలినట్లు సమాచారం . 2014 సంవత్సరంతో పోలిస్తే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో భారీ గా మార్పులు జరిగే అవకాశం ఉంది అని ఈ సర్వే లో వెల్లడైంది . వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఓటమిని ఎవరు తప్పించలేరు అని , ఈసారి వైసీపీ ఘన విజయం సాధించి తీరుతుందని తేలింది .

ఇక పొతే ఈ లగడపాటి సర్వే ప్రకారం జనసేన పార్టీ ప్రభావం తెలుగుదేశం పార్టీ పై ఎక్కువగా ఉండనుంది అని తెలుస్తుంది . ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన కారణంగా తెలుగుదేశం పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగలనుంది. మరోవైపు జగన్మోహనర్ రెడ్డి కి రాను రాను ప్రజల్లో ఆదరణ పెరుగుతోందని ఆయన చేపట్టిన ప్రజాసంకల్ప యాత్రకు ప్రజల నుంచి విపరీతమైన స్పందన వస్తుంది అని ఈ సర్వేలో తేలింది . అలాగే జగన్మోహన్ రెడ్డి పార్టీ ప్రకటించిన నవరత్నాలు మేనిఫోస్టోలకు ఆంధ్రప్రదేశ్ ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని సర్వేలో పేర్కొన్నారు.

2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు అధికారం కోల్పోయి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమని సర్వేలో స్పష్టం అయ్యింది . ఈ సర్వే ఫలితాలు చుసిన వైసీపీ శ్రేణులు ఆనందం లో మునిగితేలుతున్నారు .