శివాజీ నిన్ను చంపేస్తారు జాగ్రత్త …

 

lakshmi parvati Warms To Sivaji,Trending Andhra

హీరో శివాజీని ఉద్దేశించి వైసీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ పై జరిగిన దాడి లో ఆపరేషన్ గరుడ అంటూ శివాజీ కామెంట్స్ రాష్ట్రం లో సంచలనం సృష్టించాయి . శివాజీ స్థాయి క్యారెక్టర్ ఆర్టిస్టుకు ఎక్కువ, సినిమాల్లోని జోకర్ కు తక్కువని ఎద్దేవా చేశారు.

టీడీపీ డైరెక్షన్ లోనే శివాజీ ఆపరేషన్ గరుడ డ్రామాను నడిపిస్తున్నారని చెప్పారు. శివాజీకి తాను ఒక్క విషయాన్ని చెప్పాలనుకుంటున్నానని… టీడీపీ నేతలు అతన్ని చంపేస్తారని, ఆ తర్వాత హత్య చేసింది వైసీపీ అంటూ మరో డ్రామాకు తెరతీస్తారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

చిన్న స్థాయి నటుడైన శివాజీని రాజకీయ చదరంగంలోకి లాగారని… ఏదో ఒక రోజు అది అతని మెడకే ఉచ్చుగా మారుతుందని చెప్పారు. ఈ రాజకీయ ఉచ్చులో చిక్కుకోకుండా, కుటుంబాన్ని మంచిగా చూసుకోవాలని శివాజీకి ఆమె చెప్పుకొచ్చారు .