మ‌హాకూట‌మికి మ‌రో పార్టీ బై..బై..!

latest news about mahakutami,mahakutami,latest congress news,latest ts politics,trendingandhra,trendingandhra

మ‌హాకూట‌మిలో కుర్చీలాట క్లైమాక్స్‌కు చేరుకుంది. ఈ క్లైమాక్స్‌లో మిత్రుల మ‌ధ్య పొత్తు ఉంటుందా..? లేదా..? అనేది అతి త్వ‌ర‌లో తేల‌బోతుంది. అస‌లు ఇంత వ‌ర‌కు కూట‌మి ఏర్పాటే జ‌ర‌గ‌లేద‌ని చెబుతున్న టీజేఎస్, సీపీఐ త‌మ సీట్ల కోసం గ‌ట్టిగానే ప‌ట్టుబడుతున్నాయి. మ‌హాకూట‌మిలో ప్ర‌ధాన పార్టీగా ఉన్న కాంగ్రెస్ తీరుపై ఈ రెండు పార్టీలు అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నాయి.

అటు టీజేఎస్ అధినేత కోదండ‌రామ్ ఇటు సీపీఐ నేత‌లు ఢిల్లీ స్థాయిలో చ‌ర్చ‌లు జ‌రిపినా సీట్ల స‌ర్దుబాటు మాత్రం కొలిక్కి రాలేదు. త‌మ‌కు 95, టీడీపీకి 14 సీట్లు ఉంటాయ‌ని గ‌త వార‌మే ప్ర‌క‌టించారు కాంగ్రెస్ నేత‌లు. ఈ ప్ర‌క‌ట‌న‌పై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు సీపీఐ, టీజేఎస్ నేత‌లు.

అయితే, ఆదివారం నాడు సీపీఐ ముఖ్య నేత‌ల‌తో స‌మావేశమ‌య్యారు. సీట్ల స‌ర్దుబాటుపైనే ప్ర‌ధానంగా చ‌ర్చించారు. ప్లాన్ ఏ, ప్లాన్ బీ ప్ర‌కారం ముందుకు వెళ్లాల‌ని నిర్ణ‌యించారు. 119లో కాంగ్రెస్‌కు 95, టీడీపీకి 14 పోతే మిగిలిన ప‌ది సీట్ల‌లోనే టీజేఎస్‌, సీపీఐ స‌ర్దుబాటు చేసుకోవాల్సి ఉంటుంది.

అయితే, త‌మ‌కు 15 సీట్లు కావాల‌ని టీజేఎస్‌, త‌మ‌కు మాత్రం క‌నీసం ఐదు సీట్లన్నా కేటాయించాల్సిందేన‌ని డిమాండ్ చేస్తున్నాయి. ఐదు సాట్లు ఇస్తే ప్లాన్‌ ఏ ప్ర‌కారం కూట‌మిలో ఉంటామ‌ని, లేక‌పోతే ఒంట‌రిపోరుకు వెళ్లేలా ప్లాన్‌ బీ సిద్ధం చేసుకున్నామ‌ని ప్ర‌క‌టించారు సీపీఐ నేత‌లు. ఈ సీట్ల స‌ర్దుబాటుపై కాంగ్రెస్ ఎటూ తేల్చ‌క‌పోవ‌డంతో ఇవాళ ఏదో ఒక నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించాల‌న్న ఆలోచ‌న‌లో ఉంది సీపీఐ.