జగన్ ఒకే కానీ …క్యాడర్ లేదే ….. తాజా సర్వే..!

jagan , ap survey , trendingandhra

జగన్ పాదయాత్ర మంచి జోరు మీద సాగుతోంది. చూసేందుకు జనాలు తండోపతండాలుగా వస్తున్నారు. ఉత్తరాంధ్రలో అయితే ఒక జిల్లాను మించి మరో జిల్లా అలా జనం వెల్లువలా తరలి వస్తున్నారు. విజయనగరంలో అయితే ఓ మీటింగులు కెమెరా లెన్స్ కి కూడా అందనంత జనం వచ్చేశారు. దాంతో ఒక విషయం తేలిపోయింది. జాగన్ పాదయాత్ర సూపర్ సక్సెస్. అదే టైంలో పార్టీ సంగతేంటి.

వైసీపీ పుట్టి దాదాపు ఎనిమిదేళ్ళు అవుతోంది. వార్డు మెంబర్ నుంచి పార్లమెంట్ వరకు ఆ పార్టీ గుర్తు మీద నెగ్గిన వాళ్ళు ఎందరో ఉన్నారు. పెద్ద నాయకులు బోలెడు మంది ఉన్నారు. మరి ఇందరు ఉన్నా జనాలకు మాత్రం వైసీపీ అంటే జగన్ మాత్రమే కనిపిస్తున్నాడు. జగన్ పాదయాత్రలో ఉంటే మరో వైపు పార్టీ పడకేస్తోంది. ఏపీలో ఎన్నో సంఘటనలు ఈ ఏడాది కాలంలో జరిగాయి. మరి వాటి మీద పార్టీ పరంగా పెద్దగా స్పందించిన దాఖలాలు లేవు.

వైసీపీ అసెంబ్లీ సీట్లకు, ఎంపీ సీట్లకు పెడుతున్న క్యాండిడేట్లు చాలా వీక్ అంటున్నారు. వారిని అర్ధబలం చూసి మాత్రమే ఎంపిక చెస్తున్నారని, జనాల్లో వారెవరన్నది బొత్తిగా తెలియదని అంటున్నారు. గతంలో నాలుగేళ్ళ పాటు పనిచేసిన వారు. జనానికి పరిచయం ఉన్న వారిని డబ్బులు లేవన్న కారణాన పక్కకు పెట్టి కొత్త వారిని తేవడం వల్ల వైసీపీకి ఇబ్బందులు మొదలయ్యాయని అంటున్నారు.

నాయకులంటే నిరంతరం జనాల్లో ఉండాలి, ప్రజా సమస్యలు తెలుసుకోవాలి. జగన్ తన వరకు తాను కష్టపడుతున్నారు. మరి పార్టీ నాయకులను అలా తయారు చేయలేకపోవడం పెద్ద లోటేనని అంటున్నారు. మొత్తం పదిహేను అసెంబ్లీ, మూడు ఎంపీ సీట్లలో అత్యధిక శాతం ఇదే పరిస్థితి ఉంది.

జగన్ ఉత్తరాంధ్రలొనే ఉన్నారు. మార్పు చేర్పులు ఏమైనా చేస్తే ఇపుడే చేయాలి. ఎందుచేతనంటే ఎన్నికలకు వ్యవధి ఆరు నెలలు మాత్రమే ఉంది. చివరి నిముషంలో చేసే మార్పులు బెడిసికొడతాయి. సీన్ రివర్స్ అవుతుంది. అందువల్ల జగన్ ఇప్పటి నుంచే పార్టీని పటిష్టం చేసే నాయకులను ఎంపిక చేయకపోతే ఇబ్బందులు తప్పవని అంటున్నారు. చూడాలి ఏం జరుగుతుందో.