ఓపెన్ సేల్ కి రెడ్‌మి నోట్ 5 ప్రో….!

ఇప్పటివరకు వరకు ఫ్లాష్ సేల్‌కు మాత్రమే పరిమితమైన రెడ్‌మి నోట్ 5 ప్రో ఇప్పుడు ఓపెన్ సేల్ పై లభ్యమవుతోంది. ఈ ఏడాది ఆరంభంలో లాంచ్ అయిన ఈ స్మార్ట్‌ఫోన్‌ను అప్పటి నుంచి ఇప్పటి వరకు ఫ్లాష్‌సేల్ మోడ్ క్రిందే ఫ్లిప్‌కార్ట్ విక్రయిస్తూ వస్తోంది.

ఇప్పటి వరకు నిర్వహించిన సేల్స్‌లో భాగంగా 50 లక్షల రెడ్‌మి నోట్ 5 ప్రో యూనిట్లను విక్రయించినట్లు కంపెనీ వెల్లడించింది. తాజాగా తీసుకున్న నిర్ణయంతో ఈ డివైస్ ఇక పూర్తిస్థాయిలో ఓపెన్ సేల్ పై లభ్యమవుతుంది. ఫ్లిప్‌కార్ట్ అలానే ఎంఐ స్టోర్‌లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది. దీంతో ఈ ఫోన్‌ను ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆర్డర్ చేసుకోవచ్చు.

ఓపెన్ సేల్ ప్రారంభమైన నేపథ్యంలో ఈ ఫోన్ కొనుగోలు పై అనేక ఆఫర్లను ఫ్లిప్‌కార్ట్ సిద్ధంగా ఉంచింది. ఈ ఆఫర్‌లలో భాగంగా రెడ్‌మి నోట్ 5 ప్రోను తమ పాత స్మార్ట్‌ఫోన్‌తో ఎక్స్‌ఛేంజ్ చేసుకోవాలనుకునే వారికి ఫోన్ కండీషన్‌ను బట్టి రూ.14,000 వరకు ఎక్స్‌ఛేంజ్ క్రింద లభించే అవకాశం ఉంది.