అమ్మాయిలు వెనుక‌బ‌డ్డార‌ని చెప్పింది ఎవ‌రు.. ఏకంగా 12 మందితో..?

ఇప్పటివరకు ఒక భర్త కి చాలా మంది బార్యలు ఉంటారని విన్నాం కాని, ఈ ఘటన అందుకు పూర్తి రివర్స్ గా వుంది. నిత్య పెళ్లి కొడుకులు వున్న ఈ దేశం లో నిత్య పెళ్లి కూతురి గురించి వినడం చాల ఆచార్యాన్ని గురిచేసింది.
అసలు విషయం ఏమిటంటే మొదటగా ఆమె అందంతో వలేస్తుంది, తరువాత మాటలు కలుపుతుంది, చిన్నగా ముగ్గులోకి దింపుతుంది. తరువాత నిన్ను ప్రేమిస్తున్నాను, పెళ్లిచేసుకుందామా అని అడుగుతుంది. ఆ మాటలను నమ్మి పెళ్లి పీటలెక్కి తాళి కడితే చాలు, అక్కడి నుండి అసలు రామాయణం మొదలుపెడుతుంది. మూడు ముళ్లు పడగానే వధువు ప్రీతి కాస్తా నగలు, డబ్బుతో పారిపోతోంది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని డెహ్రాడూన్ నగరానికి చెందిన ప్రీతీ అనే వివాహిత తన భర్తతో కలిసి ఈ తరహా పెళ్లిళ్లకు తెరలేపింది.
ఈ యువతి నిత్య పెళ్లి కూతుళ్ల జాబితాలో నెం.1 స్థానాన్ని దక్కించుకునేందుకు తీవ్రంగా శ్రమించినట్టుంది అని తెలుస్తుంది. ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు 12 మంది వరులను మోసగించిందని యూపీ జిల్లా ఎస్పీ ఉదయ్ శంకర్ చెప్పారు. ఒక అమ్మాయి చేతిలో మోసపోయామని చెబితే సమాజం లో చులకనగా చూస్తారని ఎవరు నోరుమెదపలేదు.
చివరకి ఆఖరు పెళ్లి కొడుకు ధైర్యం చేశాడు. చిన్నగా కూపీ లాగితే తనకంటే ముందు 11 మంది భర్తలు, అదే బాధితులున్నారన్న నిర్ఘాంతపోయే విషయం బయటపడింది. ధైర్యం చేసి పోలీసులకు మొత్తం చెప్పేశాడు. ఫలితం ఆ మాయలాడి, ఆమె అందాన్ని ఎరగా చేసుకుని డబ్బు సంపాదనకు మరిగిన మొగుడు ఇద్దరూ కటకటాల పాలయ్యారు.
పెళ్లి ఏర్పాట్లు భర్తే చూసే వాడని పోలీసులు పేర్కొన్నారు. వీరి వెనుక మరికొందరు ముఠా సభ్యుల హస్తముందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఒక్క కేరళ రాష్ట్రంలోనే నలుగురు యువకులు ఈ యువతి మోసానికి బలయ్యారు. సో అమ్మాయి అందంగా ఉందని ముందూవెనుక ఆలోచించకుండా ప్రేమ, పెళ్లి అంటే మొదటికే మోసమొస్తుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. పెళ్లి కాని ప్రసాదులూ బీ అలర్ట్ అని హెచ్చరిస్తున్నారు ఈ మహిళా బాధితుల లిస్టు లో చేరిన వారందరు. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో జరిగిన అరుదైన మోసమిది