హనీమూన్ కి అనువైన ప్రదేశం ….భూలోక స్వర్గం ….!

honeymoon packages,honeymoon,nainital

జీవితంలో పెళ్లి ఒక మధురమైన ఘట్టం. అధురత్వానికి పరిపూర్ణత్వం తీసుకువచ్చేది హనీమూన్ అంటే అతిశయోక్తి కాదు. ఈ హనీమూన్ కోసం కొత్త దంపతులు ఎన్నోకలలు కంటూ ఉంటారు. ఇందు కోసం కనీసం మూడు నెలల ముందు నుంచి ప్రణాళికలు రచించుకొంటూ ఉంటారు. అలా హనీమూన్ అన్న తక్షణం అందమైన, ఏకాంతానికి అనువైన ప్రాంతాలు ఏవనే విషయమై మదిలో మెదులుతుంది. అటువంటి ప్రాంతాలకు నెలవు ఉత్తరాఖండ్. మరి ఆ ఉత్తరాఖండ్ లో హనీమూన్ కు అనువైన ప్రాంతాలేవో చూద్దామా …

హిమాలయ పర్వత పంక్తుల వద్ద ఉన్న నైనిటాల్ అటు వేసవితో పాటు ఇటు చలి, వర్షాకాలం కూడా నూతన దంపతులను వారి వెచ్చని కోర్కెలను తీర్చుకోవడానికి రారమ్మని ఆహ్వానిస్తుంది. ఉత్తర భారత దేశం నుంచే కాకుండా భారత దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారు తమ హనీమూన్ డెస్టినేషన్స్ లో నైనిటాల్ కు తప్పకుండా చోటు కల్పిస్తారు.

చుట్టూ మల్లెపూల పందిరిలాంటి మంచు పర్వతాలు, పూల సోయగాలను విరజిమ్మె పుష్పలోయలు, ఆపిల్ తోటలు ఇవన్నీ దేశం నలుమూలల నుంచి పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా అప్పుడే పెళ్లి చేసుకొన్నవారు ఏకాంతంగా గడపడానికి ఈ ప్రాంతం అనుకూలంగా ఉంటుంది. ఇక ఇక్కడ స్కీయింగ్ ప్రధాన ఆకర్షణ.

హిమాలయ పర్వత పంక్తుల వద్ద చుట్టూ టీ తోటలతో కనుచూపు మేర పచ్చదమే కనిపించే ప్రాంతం కౌసాని. అందువల్లే ఇక్కడికి వెళితే వేడి కోర్కెలకు అంతే ఉండదు. మీ జీవిత భాగస్వామిని కౌగిలిలో బంధించడానికి ఎటువంటి అడ్డూ ఉండదు. అందువల్లే ఉత్తరాఖండ్ కు హనీమూన్ కు వెళ్లాలనుకొన్నవారు కౌసనికి తప్పకుండా వెలుతారు. ఈ ముస్సోరి చాలా ప్రాచూర్యం చెందిన హనీమూన్ డెస్టినేషన్. ఇందుకు కారణం లేకపోలేదు. ఇక్కడ పచ్చదనంతో పాటు తెల్లటి మంచుతెరలు ఉదయం నుంచి సాయంత్రం వరకూ మిమ్ములను పలకరిస్తూనే ఉంటాయి. అందువల్లే చాలా మంది ఇక్కడికి వెలుతుంటారు.

ఉత్తరాఖండ్ లో ప్రముఖ హిల్ స్టేషన్ ఈ బిన్ సార్. అసలే హిమాలయ పర్వత పంక్తుల్లో భాగమైన ఈ బిన్ సార్ పరిసర ప్రాంతాలు జీవిత భాగస్వామి పక్కన ఉన్నప్పుడు వేడి కోర్కెలను రెచ్చకొట్టడానికి ఏ మాత్రం మోహమాట పడవు. ఇక్కడ అభయారణ్యాలకు కొదువు లేదు. ముఖ్యంగా 200 పక్షిజాతులు ఈ బిన్ సార్ అభయారణ్యంలో కనిపిస్తాయి.

#HoneyMoon #Himalaya #Nainital #TheIdealPlaceForHoneyMoonTheEarthParadise