జగన్ పై లోకేష్ అదిరిపోయే పంచ్

lokesh , nara lokesh , trendingandhra

ఆంధ్రప్రదేశ్ విపక్ష నేత జగన్ పై విశాఖ విమానాశ్రయంలో దాడి జరిగిన సంఘటన రాజకీయ౦గా పెద్ద దుమారమే రేగుతుంది. జగన్ పై తెలుగుదేశ౦ పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. అది ఒక డ్రామా అంటూ కొట్టిపారేస్తున్నారు. తాజాగా ఐటి మరియు పంచాయితి రాజ్ శాఖల మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా ఘాటు వ్యాఖ్యలు చేసారు. “వైకాపా కోడి కత్తి డ్రామా! అధికారం కోసం అడ్డదారులు తొక్కడం జగన్ కి కొత్త కాదు.

Nara-Lokesh,trendingandhra

మరో సారి ఓటమి తప్పదు అనే భయంతో కోడి కత్తి డ్రామా కి తెరలేపారు. దాడి వెనుక ఉన్న వైకాపా కుట్ర ప్రజలకు అర్థం అయ్యింది.ఇంకా ప్రజలను మభ్య పెట్టాలి అని వైకాపా నేతలు మొసలి కన్నీరు కారుస్తున్నారు.” అంటూ మొదటి ట్వీట్ చేసిన మంత్రి వెంటనే మరో ట్వీట్ చేసారు. “తండ్రి చితికి నిప్పు పెట్టకముందే ముఖ్యమంత్రి పీఠం పై కన్నేసిన వ్యక్తి ఇలాంటి కత్తి డ్రామా చెయ్యడంలో ఆశ్చరం లేదు.ఎన్ని కుయుక్తులు పన్నినా ఆఖరిగా ప్రజల ముందు గెలిచేది నిజం మాత్రమే.” అంటూ మండిపడ్డారు.

#LokeshSensationalCommentsOnJaganMohanReddy #Lokesh #Jagan