రేపే రిలీజ్ కానున్న మహానటి ట్రిజర్…కీర్తి సురేష్ ఫస్ట్ లుక్…!

టాలీవుడ్ లో ఇప్పుడు బయోపిక్ లను తెరకెక్కించడం ఒక ట్రెండ్ గా మారిపోయింది. ప్రస్తుతం టాలీవుడ్ లో నాలుగు బియోపిక్ కు రూపొందుతున్నాయి. వాటిల్లో తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నా చిత్రం మహానటి సావిత్రి గారి జీవిత చరిత్ర ఆధారం గా తెరకెక్కుతున్న ‘మహానటి’.

ఈ మహానటి సినిమాను వైజ‌యంతీ మూవీస్, స్వ‌ప్న సినిమా సంయుక్తంగా తెర‌కెక్కిస్తున్నాయి .ఇందులో మహానటి సావిత్రి పాత్ర‌లో కీర్తి సురేష్ కనిపించనున్నది. నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నడు. ఈ చిత్రానికి నిర్మాత‌ గా ప్రియాంక ద‌త్ వ్యవహరిస్తున్నాడు . ప్రస్తుతం షూటింగ్ పార్ట్ ను పూర్తీ చేసుకుని పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జరుపుకుంటుంది.

ఈ చిత్ర బృందం రేపు “మహానటి” మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేయనున్నారు. దీనితో పాటు సినిమాలో కీలక మైన పాత్రను పోషిస్తున్న కీర్తి సురేష్ ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన సమంత, విజయ్ దేవరకొండల ఫస్ట్ లుక్స్ మరియు మోషన్ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో ఎస్వీ రంగారావుగా మోహన్ బాబు స్క్రీన్ ప్రెజన్స్ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.