అదిరిపోతున్న ప్రిన్స్ లుక్ ..!

mahesh babu,trendingandhra

భరత్ అనే నేను గ్రాండ్ సక్సెస్ తర్వాత మహేష్ బాబు చేస్తున్న మహర్షి షూటింగ్ ఇంకా సగం కూడా పూర్తి కాకుండానే అంచనాలు ఆకాశాన్ని దాటేస్తున్నాయి. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ముగ్గురు అగ్ర నిర్మాతలు చేస్తున్న ఈ ప్రాజెక్ట్ మీద వందకోట్లకు పైగా ప్రీరిలీజ్ బిజినెస్ జరగనుందని వినికిడి. ఇటీవలే అమెరికాలో కీలక షెడ్యూల్ మొదలుపెట్టుకున్న మహర్షి తాలూకు అఫీషియల్ కాదు కానీ సెట్స్ లో నుంచి లీక్ అవుతున్న స్టిల్స్ ఫాన్స్ ని నిద్రను దూరం చేస్తున్నాయి.

maheshbabu,trendingandhra

సూటు బూతులో గాగుల్స్ పెట్టి ఎదో పెద్ద కంపెనీ సిఈఓ లేక మల్టీ మిలీనియనీర్ లా ప్రిన్స్ లుక్ లో అరాచకం అనిపించేలా ఉన్నది. ఇటీవలే దీని షూటింగ్ కోసం ఫామిలీతో అక్కడికి వెళ్ళిపోయిన మహేష్ అది పూర్తయ్యాక తిరిగి హైదరాబాద్ రానున్నాడు. ఫస్ట్ హాఫ్ లో వచ్చే కీలకమైన ఎపిసోడ్ కోసం వంశీ పైడిపల్లి ఈ ట్రాక్ డిజైన్ చేశాడట. ఇన్ సైడ్ టాక్ ప్రకారం అల్లరి నరేష్ తో ఏదో లింక్ ఉన్న ఓ మేజర్ టర్నింగ్ తర్వాత అమెరికా నుంచి తెలంగాణలో ఓ పల్లెటూరికి మహేష్ రావాల్సి వస్తుందట.

mahesh babu,trendingandhra

అక్కడ నుంచి హై వోల్టేజ్ ఎమోషన్ తో పాటు మాస్ కు కావలసిన యాక్షన్ డ్రామా ఓ రేంజ్ లో ఉంటుందని తెలుస్తుంది. కిరాక్ అనిపించే లుక్స్ వయసు పదేళ్ల క్రితమే బ్లాక్ అయిపోయిందా అనిపించేలా రోజు రోజుకి గ్లామర్ తో చంపేస్తున్న మహేష్ ని చూస్తే మహర్షి కోసం ఏప్రిల్ దాకా ఆగడం కష్టమే అంటున్నారు అభిమానులు. పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న మహర్షికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం ఓ ప్రధాన ఆకర్షణగా నిలవబోతోంది.

#MaheshBabuMaharshiMovieUpdates #PrinceMaheshbabu #MaharshiMovie