మణిరత్నం తాజా చిత్రం నవాబ్: ట్రైలర్ విడుదల..

యాక్షన్ సినిమాలను క్లాసిక్స్‌గా మలిచే దర్శకుడు ఎవరైనా ఉన్నారంటే అది మణిరత్నం అని చెప్పవచ్చు. వరస పరాజయాలోతో ఉన్న మణిరత్నం ఇటీవలే ‘ఓకే బంగారం’తో ఫర్వాలేదనిపించుకున్నా.. ఆ తర్వాత ‘చెలియా’తో తన ఫ్యాన్స్‌ను కూడా నిరాశ పరిచాడు. ఇప్పుడు ఎటువంటి హడావుడి లేకుండా ‘నవాబ్’తో వస్తున్నారు మణిరత్నం.

తమిళం నుంచి అనువాదం అయిన ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ తాజాగా విడుదల అయ్యింది. రెండు నిమిషాల 46 సెకెన్ల వ్యవధితో ఉండే ఈ ట్రైలర్ ఒక యాక్షన్ డ్రామాను తలపిస్తోంది. ఇక ఈ చిత్రం ట్రైలర్ విషయానికి వస్తే హీరో ఎవరూ లేరు అన్నట్లు అందరివీ ప్రధాన పాత్రలే అన్నట్టుగా సాగుతుంది. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, అరవింద్ స్వామి, శింబులతో పాటు విజయ్ సేతుపతి, అరుణ్ విజయ్‌లు కూడా నటిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది.