ఆన్ లైన్ లో మందుల అమ్మకంపై నిరసనగా ….నేడు దేశవ్యాప్తంగా మెడికల్ షాపుల బంద్

chemist bandh , trendingandhra

దేశ వ్యాప్తంగా నేడు మెడికల్ షాపులు బంద్ కానున్నాయి. ఆన్ లైన్ లో మందుల అమ్మకం, ఈ-ఫార్మసీ విధానాన్ని నిరసిస్తూ ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ (ఏఐఓసీడీ) ఇచ్చిన పిలుపు మేరకు మెడికల్ షాపులు బంద్ పాటించనున్నాయి.

medical shops , trendingandhra

ఈ బంద్ కు ‘ద తెలంగాణ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్’ (టీటీసీడీఏ) సంస్థ కూడా మద్దతు ప్రకటించింది. ఆన్ లైన్ లో మందులు విక్రయించడం డ్రగ్స్ చట్టం నిబంధనకు వ్యతిరేకమని పేర్కొన్న టీటీసీడీఏ ప్రతినిధులు, ఇరవై నాలుగు గంటల పాటు ఈ బంద్ కొనసాగనుందని, ప్రజలు నిత్యం వినియోగించే మందులను ముందుగానే కొనుగోలు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.