రాత్రికి రాత్రే అలోక్‌ వర్మను తొలగించిన మోడీ

alok verma,trendingandhra

‘రాత్రికి రాత్రే అలోక్‌ వర్మను దేశ కాపలాదారుడు (ప్రధాని మోదీ) పదవి నుంచి తొలగించారు. రఫేల్‌ ఒప్పందంపై ఆయన విచారణ జరుపుతారనే భయంతోనే ఈ పనిచేశారు’ అని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒక వైపు రాఫెల్ కుంభకోణం విషయంలో విపక్షాలు అనేక ఆరోపణలు చేస్తున్న తరుణంలో కీలకమైన అధికారిని మార్చి మోడీ తన నిజాయితి నిరూపించుకోవాలి అని అనుకోవడం నిజంగా హాస్యాస్పదం అని సోషల్ మీడియాలో కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

alok varma,trendingandhra

అసలు కీలక వ్యక్తిని పదవి నుంచి తొలగించడం ద్వారా ఏ సంకేతాలు ఇస్తారు అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే సిబిఐ లో అవినీతి మరకలతో ఆ వ్యవస్థ భ్రష్టు పట్టిపోయిన సంగతి తెలిసిందే ఇలాంటి తరుణంలో ఈ నిర్ణయంతో సిబిఐ కేంద్రం కనుసన్నల్లో ఉంది అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది.

#ModiGovernmentRemovesAlokVermaasCBIDirector #Modi #AlokVerma