ూ.980 కోట్లు ఖ‌ర్చు పెట్టిన చంద్ర‌బాబు.. ఎంద‌కో తెలిసి.. మోడీ షాక్‌..!

shock to modi ,modi ,Chandrababu ,TrendingAndhra

ప‌శ్చిమ గోదావ‌రి ప్రాంతంలో ఒక ఇంట‌ర్మీడియ‌ట్ అమ్మాయి ఇంట్లో సాయంత్రం వంట చేస్తున్న స‌మ‌యంలో హ‌ఠాత్తుగా సోడా గ్యాస్ సిలిండ‌ర్ దూసుకొచ్చి ఆ అమ్మాయి కాలు తెగిప‌డిపోయింది. కుంద‌న‌పు బొమ్మ‌లాంటి అమ్మాయి కొన ఊపిరితో, వైక‌ల్యంతో మంచానికే ప‌రిమితం అయింది. అందుకు ఓ మ‌న‌సు స్పందించింది.

బెజ‌వాడ ప‌డ‌మ‌ట‌లో క‌రెంటు ప‌నిచేసే వ్య‌క్తి షాక్‌కు గురై స‌గానికిపైగా కాలిన గాయాల‌తో ఆస్ప‌త్రిపాల‌య్యాడు. ఓ చేతిని తీసేయాల్సి వ‌చ్చింది. ఓ హృదయం స్పందించి కొత్త జీవితాన్ని ఇచ్చింది.

చిత్తూరు జిల్లా ఓ ప‌ల్లెటూరిలో ఆడుకుంటున్న చిన్నారి స‌డెన్‌గా ప‌డిపోయి ఆస్ప‌త్రిపాల‌యింది. గుండెలో హోల్ ఉంది. ఆప‌రేష‌న్‌కు ల‌క్ష‌లు ఖ‌ర్చ‌వుతుంద‌ని వైద్యులు చెప్పారు. మ‌ళ్లీ అదే మ‌న‌సు కొత్త ఊపిరిలూదింది. ఇలా చెప్పుకుంటూ పోతే.. జ‌రిగిన సంఘ‌ట‌న‌లు.. స్పందించిన హృద‌యానికి లెక్క‌లే లేవు. అలా స్పందించిన హృద‌యం చంద్ర‌బాబుదేన‌ని తెలుగు ప్ర‌జ‌లు అంటున్నారు.

వ్య‌వ‌సాయానికి బ‌డ్జెట్ ఉంది. రోడ్లు వేసేందుకు ఓ లెక్క ఉంది. చ‌దువుల కోసం, వైద్యం కోసం ఇలా ప్ర‌తీ విష‌యానికి సంబంధించి కొంత మొత్తాన్ని ఖ‌ర్చు చేసేందుకు ప్ర‌భుత్వాలు ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తాయి. కానీ, పేదోడికి సాయం చేసేందుకు మాత్రం ఎక్క‌డా ప్ర‌త్యేకంగా నిధులు ఉండ‌వు. అయితే, ప్ర‌భుత్వానికి కూడా మ‌న‌స్సు ఉంటుంద‌ని నిరూపిస్తున్న వ్య‌క్తి సీఎం చంద్రబాబు మాత్ర‌మే. త‌క్ష‌ణ సాయం కోసం, పేద‌ల కోసం చంద్ర‌బాబు ఖ‌ర్చు చేసిన నిధుల‌ను చూస్తే అర్థ‌మ‌వుతుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఏకంగా 890 కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు పెట్టారట చంద్ర‌బాబు. ఈ విష‌యాన్ని కాస్తా బీజేపీ నేత‌లు ప్ర‌ధాని మోడీ చెవిన వేశారు.

చిన్నారుల‌కు, మ‌హిళ‌ల‌కు, వృద్ధుల‌కు ఇలా ఆప‌ద‌లో ఉన్న ప్ర‌తీ ఒక్క‌రికీ త‌క్ష‌ణ సాయం అందించేందుకు చంద్ర‌బాబు నాయుడు అంద‌రి ముఖ్య‌మంత్రుల‌కంటే ముందు వ‌రుస‌లో ఉంటున్నారు.