నాని హీరోగా, సిద్దార్థ్ విలన్ గా  ఏంటా సినిమా … ..

Nani's Hero, Sidharth as Villain Movie, Trending Andhra
 
చాల విభిన్న సినిమాల దర్శకుడిగా ఆయనకు పేరు ఆయన తీసే ప్రతి సినిమా ఏదో ఒక కొత్తదనమ్ ఉండేలా ప్రేక్షకుల మనస్సులో ఉండిపోయేలా తన చిత్రాల ఎంపిక అల ఉంటుంది .ఇష్క్, మనం, 24..’ ఇలా లిస్ట్‌ చూస్తేనే వినూత్నమైన సినిమాలు కనిపిస్తుంటాయి విక్రమ్‌ కె.కుమార్‌  ఫిల్మ్ మార్క్  . కొత్త కాన్సెప్ట్‌లతో ఎప్పటికప్పుడు ప్రేక్షకులను థ్రిల్‌కి గురి చేస్తుంటారాయన. ‘హలో’ సినిమా రిలీజ్‌ అయి ఏడాది కావస్తున్నా ఆయన నెక్ట్స్‌ ప్రాజెక్ట్‌ ఇంకా సెట్స్‌ మీదకు వెళ్లలేదు.ఇలాంటి సంధర్బములోనే లేటెస్ట్‌గా వినిపిస్తున్న వార్త ఏంటంటే.. ఓ మల్టీస్టారర్‌ ప్రాజెక్టును తెరమీదకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు విక్రమ్‌.
Related image
ఇందులో ఎవరెవరు నటిస్తున్నారు వాళ్ళ పాత్రలు ఎలా ఉండబోతున్నాయి అనే క్యూరియాసిటీ ఎలాగు మాములే ఐతే.  మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నాని హీరోగా విక్రమ్‌ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. విశేషం ఏంటంటే… ఇందులో విలన్‌ పాత్రలో హీరో సిద్ధార్థ్‌ కనిపిస్తారని సమాచారం. ఆఫ్‌ స్క్రీన్‌ నాని, సిద్ధార్థ్‌ మంచి ఫ్రెండ్స్‌. మరి ఆన్‌స్క్రీన్‌లో ఇద్దరూ ఎలా విరోధుల్లా మారతారో చూడాలి. అలాగే లవర్‌బాయ్‌గా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న సిద్ధార్థ్‌ విలన్‌గా ఎలా ఆకట్టుకుంటారో చూడాలి. థ్రిల్లర్‌ నేపథ్యంలో ఈ కథాంశం ఉండబోతోందట. ఇప్పటికే ఈ సినిమాలో నాని లుక్‌ టెస్ట్‌ కూడా చేశారట. మరి ఈ చిత్రం సెట్స్‌ మీదకు ఎప్పుడు వెళుతుందో చూడాలి