వారిని కూడా ఇంప్రెస్ చేస్తున్న సాయి ప‌ల్ల‌వి..!

Sai Prabhavi is also impressed by them, Trending Andhra
డ్యాన్స్ విష‌యానికొస్తే.. సినీ జ‌నాలు హీరోల పేర్ల‌నే తలుస్తారు. అప్పుడెప్పుడో డ్యాన్స్‌లో చిరంజీవికి స‌మ ఉజ్జీగా నిలిచిన రాథ డ్యాన్స్ గురించి మాట్లాడుకున్నారు. త‌న‌తో పోటీప‌డి మ‌రీ రాధ డ్యాన్స్ చేసేద‌ని చిరంజీవి చాలా సంద‌ర్భాల్లో చెప్పారు. 
 
తెలుగులో ఎంతో మంది స్టార్ హీరోయిన్స్ ఉన్నా డ్యాన్స్ విష‌యంలో హీరోల‌ను అందుకోలేకపోతున్నారు. బ‌న్నీ, ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ వంటి టెర్రిఫిక్ డ్యాన్స‌ర్స్‌ను త‌ట్టుకునే ప్ర‌య‌త్నం ఒక్క హీరోయిన్ కూడా చేయ‌లేదు. అయితే, సాయి ప‌ల్ల‌వి మాత్రం హీరోల‌కు మించిన ఫ‌ర్ఫామెన్స్‌తో ఆక‌ట్టుకుంటోంది. 
Image result for Sai Pallavi
సాయి ప‌ల్ల‌వి చిన్న‌ప్ప‌ట్నుంచి మంచి డ్యాన్స‌ర్ కావ‌డంతో బుల్లితెర డ్యాన్స్ ప్రోగ్రామ్స్‌లో మంచి ఫ‌ర్ఫామెన్స్‌ను క‌న‌బ‌రిచింది. ఇక సినిమాల్లో అయితే మంచి ఈజ్‌తో ఆడియ‌న్స్‌ను ఈజీగా ఫిదా చేసేస్తోంది. హీరోనుబ‌ట్టి కాకుండా హీరోయిన్‌ను చూసి మ్యూజిక్ కంపోజ్ చేసే ట్రెండ్‌ను తీసుకొచ్చింది సాయి ప‌ల్ల‌వి. ఈ అమ్మ‌డు ఉంటే డ్యాన్స్‌కు స్కోప్ ఉన్న ట్యూన్స్‌ను ఇవ్వాల‌ని మ్యూజిక్ డైరెక్ట‌ర్ డిసైడైపోతున్నారు. 
 
సాయిప‌ల్ల‌వి ప్ర‌స్తుతం త‌మిళంలో మారి -2 సినిమా చేస్తోంది. ఇందులో ఫ‌స్ట్ సాంగ్ లిరిక్స్ వీడియోను రిలీజ్ చేశారు. ఈ ఎన‌ర్జ‌టిక్ డ్యాన్స‌ర్ కోసమే అన్న‌ట్టు ఫాస్ట్‌బీట్ సాంగ్‌ను కంపోజ్ చేశాడు యువ‌న్ శంక‌ర్ రాజా. ఈ లెక్క‌న సాయి ప‌ల్ల‌వి త‌న డ్యాన్స్‌తో హీరో ధ‌నుష్‌ను డామినేట్ చేయ‌డం ఖాయ‌మంటున్నారు సినీ జ‌నాలు.