కేసీఆర్ ను ఒంటరిగా ఎదుర్కొనే దమ్ము వాళ్ళకి లేదు..!

MP Kavitha , TrendingAndhra

తెలంగాణా రాష్ట్రంలో ఇప్పటికే అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు తాము సిద్ధం అంటూ ఆ రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించగానే అక్కడి ఎన్నికల వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.అందులో భాగంగానే ఇప్పుడు తెలంగాణలోని ప్రజలకు మరింతగా చేరువయ్యేందుకు 50 రోజుల్లో 100 సభలు చేపడేతున్నాం అని ప్రకటించారు.ఈ సభా నిర్వహణ పనులు కేసీఆర్ యొక్క కూతురు ఆపద్ధర్మ మంత్రి కే.కవిత దగ్గరుండి చూసుకుంటున్నారు. అందులో భాగంగా తెరాస ఎంపీ కవిత కాంగ్రెస్ వారు చేస్తున్న వ్యాఖ్యలుకు గాను వారు తెరాస పార్టీకి ఓటు వేస్తే అక్కడ కేంద్రంలోనూ ఇక్కడ రాష్ట్రంలోనూ బీజేపీకి వేసినట్టే అన్న మాటలకు కవిత కూడా ఘాటుగానే ఆవిడ స్పందనను తెలియజేసారు.వారికి ఈ ముందస్తు ఎన్నిక్షల్లో కేసీఆర్ ని చూసి భయం పెట్టేసుకున్నారని,అందుకే ఒంటరిగా ఎన్నికల బరిలోకి దిగే దమ్ము లేక ఇలా కూటములు కట్టుకుంటున్నారని,ఇప్పటి వరకు బద్ద శత్రువులులా ఉండే టీటీడీపీ టీకాంగ్రెస్ వారు సిగ్గు లేకుండా కలిసిపోయారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ కాంగ్రెస్ కి ఓటు వేస్తే అది చంద్రబాబుకి వేసినట్టే అవుతుందని తెలిపారు.