జగన్ పై కత్తితో దాడి ….!

jagan , trendingandhra

వైకాపా అధినేత వైఎస్‌ జగన్‌పై విశాఖ విమానాశ్రయంలో దాడి జరిగింది. ప్రస్తుతం విజయనగరం జిల్లాలో పాదయాత్ర చేస్తున్న జగన్‌.. అక్రమాస్తుల కేసులో రేపు నాంపల్లిలోని న్యాయస్థానంలో హాజరుకావాల్సి ఉంది. దీంతో హైదరాబాద్‌ వెళ్లేందుకు ఈరోజు మధ్యాహ్నం ఆయన విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానం బయలుదేరేందుకు సమయం ఉన్నందున వీఐపీ లాంజ్‌లో ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆ సమయంలో అటుగా వెళ్తున్న ఓ వెయిటర్‌ ఫోర్క్‌తో జగన్‌పై దాడి చేశాడు. ఈ ఘటనతో విమానాశ్రయ సిబ్బంది షాక్‌కు గురయ్యారు. అయితే వెంటనే తేరుకుని అతడిని అదుపులోకి తీసుకున్నారు. స్థానిక పోలీసులకు సమాచారం అందించి నిందితుడిని వారికి అప్పగించారు. జగన్‌కు వెంటనే చికిత్స అందించారు. ఈ దాడిలో జగన్‌ భుజానికి గాయమైనట్లు తెలుస్తోంది.

ఈ ఘటన జరిగిన వెంటనే విమానాశ్రయంలోని ప్రవేశించే మార్గాన్ని పోలీసులు మూసివేశారు. లోనికి ఎవరినీ రాకుండా అడ్డుకుంటున్నారు. జగన్‌పై దాడి సమాచారం తెలుసుకున్న వైకాపా నేతలు పెద్దయెత్తున విమానాశ్రయానికి చేరుకుంటున్నారు. స్థానిక ఏసీపీ హుటాహుటిన విమానాశ్రయానికి చేరుకుని సంఘటనపై వివరాలు తెలుసుకున్నారు. దాడికి పాల్పడిన నిందితుడి వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

#MurderAttemptonJagan #Jagan #MurderAttempt