చిరు ని డైరెక్ట్ చేయబోయే ఆ యంగ్ డైరెక్టర్ ఎవరో తెలుసా…!

nag ashwin , chiranjeevi , trendingandhra

ఈ మద్య టాలీవుడ్ లో యువ దర్శకులు మంచి కంటెంట్ తో రావడమే కాదు ఒకటీ రెండు సినిమాలతోనే తామేంటో ప్రూఫ్ చేసుకుంటారు. అలాంటి వారిలో నాగ్ అశ్విన్ ఒకరు. అలనాటి మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తీసిన మహానటి సినిమాతో ఒక్కసారిగా అందరి దృష్టినీ తన వైపునకు తిప్పుకున్నాడు యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్‌. అప్పట్లో సావిత్రి జీవితం గురించి పరిశోధన చేయడం, ఆవిడ గురించిన పుస్తకాలు చదవడం, ఆమె బంధువులు, పిల్లలతో మాట్లాడడం.. ఇలా స్క్రిప్టు కోసమే దాదాపు సంవత్సరం కష్టపడ్డాడు.

nag ashwin,trendingandhra

ఆ మద్య అశ్వనీదత్‌ మాట్లాడుతూ… గత రెండు మూడేళ్లుగా చిరంజీవి గారికి ఎన్నో కథలు వినిపిస్తున్నాము, కానీ కుదరట్లేదు. మా కాంబినేషన్‌లో ఒక పెద్ద సినిమా ఉంటుంది. నాగ్‌ అశ్విన్‌ కూడా ఒక లైన్‌ అనుకున్నారని.. సినిమా పేరు భైరవ అని… టైమ్‌ మిషన్‌ కాన్సెప్ట్‌తో సినిమా ఉండొచ్చని అన్నారు. దానికి చిరంజీవి మాట్లాడుతూ.. నాకూ పాతాళ భైరవి లాంటి సినిమా, జానపద నేపథ్యంలో, మాయలు మంత్రాలు లాంటి సినిమా చేయాలని ఉందంటూ తెలిపారు.

chiranjeevi, nag ashwin , trendingandhra

ఈ నేపథ్యంలో చిరంజీవి కోసం నాగ్ అశ్విన్ ఒక కథను సిద్ధం చేస్తున్నాడనీ, ఆ కథ పూర్తయిన తరువాత నేరేషన్ వుంటుందని వార్తలు వచ్చాయి. వైజయంతీ మూవీస్ తదుపరి సినిమా చిరంజీవితోననే ప్రచారం జరుగుతోంది.

#NagAshwintodirectChiranjeevi’snextfilm #NagAshwin #Chiranjeevi