నాగ్ సాంగ్ చైతు ట్రైలర్ వాయిదా???

నాగ్ సాంగ్ చైతు ట్రైలర్ వాయిదా???

Nagarjuna first single

ఈ రోజు అక్కినేని నాగార్జున పుట్టిన రోజు.ఈ సందర్భంగా అభిమానులకు రెండు కానుకలు రెడీ చేసారు. అందులో ఒకటి నాగ చైతన్య సినిమా ‘శైలజా రెడ్డి అల్లుడు’ ట్రైలర్ కాగా రెండోది నాగార్జున నటించిన ‘దేవదాస్’ సినిమా నుండి మొదటి సింగిల్. కానీ ఈరోజు ఉదయం నందమూరి హరికృష్ణ యాక్సిడెంట్ లో మరణించడంతో ఈ ట్రైలర్ – సాంగ్ రిలీజ్ ను వాయిదా వేశారు.

Also Read:—బాబాయ్ కి సప్రైజ్ ఇవ్వనున్న అబ్బాయి????

Naga chaitanya Trailer
‘దేవదాస్’ సినిమా ఫస్ట్ సింగల్ ను ఈరోజు ఉదయం 10 గంటలకు విడుదల చేస్తున్నట్టుగా నిన్న చిత్ర నిర్మాతలు ప్రకటించిన విషయం తెలిసిందే. హరి కృష్ణ మరణ వార్త తెలిసిన తర్వాత ఆదిత్య మ్యూజిక్ వారు తమ అధికారిక ట్విట్టర్ ద్వారా నందమూరి కుంటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ తమ పాట విడుదల కార్యక్రమాన్ని వాయిదా వేసినట్టు వెల్లడించారు.
మరోవైపు ‘శైలజా రెడ్డి అల్లుడు’ నిర్మాతలు మా సినిమా ట్రైలర్ లాంచ్ ను వాయిదా వేస్తున్నాము. త్వరలో కొత్త డేట్ ను ప్రకటిస్తాం” అని తెలిపారు

Also Read:——ప్లాప్ సినిమా తో రికార్డ్స్ క్రియేట్ చేసిన సూపర్ స్టార్???