చైతు -సామ్ కొత్త సినిమా పేరేంటో తెలుసా…!

పెళ్లి తరువాత నాగ‌చైత‌న్య‌, స‌మంత క‌లిసి ఓ సినిమాలో న‌టించ‌డానికి అంగీక‌రించిన విషయం సంగ‌తి తెలిసిందే. నిన్ను కోరి సినిమాతో మంచి విజ‌యాన్ని అందుకున్న డైరెక్ట‌ర్ శివ నిర్వాణ ఈ సినిమాను రూపొందిస్తున్నాడు.

వివాహానికి ముందు నాగ‌చైత‌న్య‌, స‌మంత క‌లిసి ఏ మాయ చేశావే , మ‌నం, ఆటోన‌గ‌ర్ సూర్య‌ వంటి సినిమాల్లో క‌లిసి న‌టించిన సంగ‌తి తెలిసిందే. పెళ్లి త‌ర్వాత వీరిద్ద‌రూ క‌లిసి న‌టిస్తున్న సినిమాను శివ నిర్వాణ రూపొందించ‌నున్నాడు. తాజాగా ఈ సినిమా టైటిల్ గురించి ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రుగుతోంది.

ఈ సినిమాకు మ‌జిలి అనే టైటిల్‌ను ఫిక్స్ చేసిన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. త్వ‌ర‌లోనే ఈ టైటిల్‌ను అధికారికంగా ప్ర‌క‌టించ‌బోతున్న‌ట్టు స‌మాచారం. త్వ‌ర‌లోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్ల‌నుంది