నాగచైతన్య సినిమా ఫస్ట్ లుక్ డేట్ ఫిక్స్ ……?

నాగచైతన్య సినిమా ఫస్ట్ లుక్ డేట్ ఫిక్స్ ......?

యుద్ధం శరణం గచ్చామి సినిమా తో అపజయాన్ని చవి చూసినా నాగచైతన్య సవ్య సాచి తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
“ప్రేమమ్” వంటి సూపర్ సక్సెస్ అనంతరం అక్కినేని నాగచైతన్య, చందు మొండేటిల క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం “సవ్యసాచి”. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మాధవన్, భూమికలు ప్రత్యేక పాత్రలు పోషిస్తున్నారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు వై.నవీన్-వై.రవిశంకర్-మోహన్ లు మాట్లాడుతూ.. “మా యూనిట్ సభ్యులందరికీ ‘సవ్యసాచి’ ఒక స్పెషల్ ఫిలిమ్. ప్రస్తుతం హైద్రాబాద్‌లో హీరో నాగచైతన్య, భూమికలపై కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. ఈ షెడ్యూల్ పూర్తవ్వగానే నెక్స్ట్ షెడ్యూల్ కోసం టీమ్ అమెరికా వెళ్లనుంది. సినిమా ఫస్ట్ లుక్ ను మార్చి 18న విడుదల చేయాలనుకొంటున్నాం. అలాగే “సవ్యసాచి” చిత్రాన్ని జూన్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నద్ధమవుతున్నాం.
ఆడియన్స్‌ను ఆశ్చర్యపరిచే స్థాయిలో సినిమా ఉంటుంది. ఆర్.మాధవన్ పాత్ర సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఇక “బాహుబలి” తర్వాత కీరవాణి గారు “సవ్యసాచి”కి సంగీతం సమకూర్చడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది” అన్నారు.
“సవ్యసాచి” ఫస్ట్ లుక్ మరియు రిలీజ్ డేట్‌లను ఎనౌన్స్ చేశారు మైత్రీ మూవీ మేకర్స్ చిత్రబృంధం.ఇక ఇందులో నాగచైతన్య సరసన నిధి అగర్వాల్ నటిస్తోంది.
నాగచైతన్య, చందు మొండేటిల క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం ఏ మేరకు ప్రేక్షకులను అలరిస్తుందో చూడాల్సిందే..!