హీరో వేషాలు వేస్తానంటున్న నాగ్‌

nagarjuna,trendingandhra
 
అక్కినేని నాగార్జున ఈ ఏడాది ఆఫీస‌ర్ సినిమాలో న‌టించి ఘోర‌మైన అప‌జ‌యాన్ని అందుకున్నారు. ఆ సినిమా థియేట‌ర్ల‌లో కోటి రూపాయ‌ల‌ను మాత్ర‌మే రాబ‌ట్టుకుంది. మొత్తం మూడు రోజులు ఆడి కోటి రూపాయ‌ల‌ను మాత్ర‌మే తెచ్చుకుంది. ఇంత ఘోర‌మైన ఫ్లాప్ ఏ బ‌ఢా హీరోకు ద‌క్క‌లేదు. ఆ క్రెడిట్ నాగార్జున‌కు మాత్ర‌మే ద‌క్కేలా రామ్‌గోపాల్ వ‌ర్మ చేశాడు.
 
ఆఫీస‌ర్ ఫ్లాప్‌తో భ‌య‌ప‌డ్డ నాగార్జున కొన్నాళ్ల‌పాటు హీరో వేషాలు వేయొద్ద‌ని నిర్ణ‌యించుకున్నాడు. అందుకే, వ‌రుస‌గా అతిధిపాత్ర‌లు, మ‌ల్టీస్టార‌ర్ సినిమాలు ఒప్పుకుంటున్నాడు. అలా న‌టించిన చిత్ర‌మే దేవ‌దాసు. నానితో క‌లిసి న‌టించాడు. నాని, నాగ్ క‌లిసి న‌టించినా ఫ‌లిత‌మేమీ మార‌లేదు. సినిమా రూ.23 కోట్ల‌పైగానే క‌లెక్ట్ చేసినా ఫ్లాప్‌గానే నిలిచింది. చివ‌ర‌కు నాగ్‌కు మల్టీస్టార‌ర్ కూడా క‌లిసి రాలేదు. 
 
రాజుగారి గ‌ది -2, ఆఫీస‌ర్‌, దేవ‌దాసు ఇలా వ‌రుస‌గా ఫ్లాప్‌టు రావ‌డంతో ఇప్పుడు నాగార్జున ఆలోచ‌న‌లో ప‌డ్డాడు. ఇంత‌కు ముందే ఒప్పుకున్న త‌మిళ‌సినిమా ఒక‌టి, హిందీ సినిమా ఒక‌టి పూర్త‌యిన త‌రువాత ఇక‌పై గెస్ట్ రోల్స్ బంద్ చేయాల‌ని అనుకుంటున్నాడ‌ట‌. ప్ర‌స్తుతం తమిళ‌, హిందీ సినిమాల్లో చిన్న పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నాడు నాగార్జున‌.  అవి మ‌ల్టీస్టార‌ర్ మూవీస్‌.   
 
 
కొత్త ఏడాదిలో రిస్క్ అయినా ప‌ర్వాలేదు. హీరోగానే న‌టించాల‌నుకుంటున్నాడు. త‌న కెరీర్‌లో పెద్ద హిట్‌గా నిలిచిన సోగ్గాడే చిన్ని నాయ‌న సినిమా సీక్వెల్‌ను వ‌చ్చే ఏడాది ప్రారంభిస్తాడట నాగ్‌. బంగార్రాజు పేరుతో తెర‌కెక్క‌నున్న ఈ సినిమాలో నాగార్జున హీరోగానే క‌నిపిస్తారు. అలాగే, మ‌న్మ‌థుడు సినిమాకు సీక్వెల్‌గా మ‌న్మ‌థుడు -2కూడా మొద‌లు పెట్ట‌నున్నాడ‌ట‌. ఈ రెండు సీక్వెల్స్ వ‌చ్చే ఏడాదినాడే రిలీజ్ కానున్నాయి. సోలో హీరోగా సినిమాలు చేయ‌క‌పోతే పూర్తిగా వెన‌క‌బ‌డ‌తామ‌నే ఉద్దేశంతోనే నాగార్జున ఇప్పుడు మ‌న‌సు మార్చుకున్నాడ‌ట‌.  రీసెంట్‌గా నాగార్జున ఫ్యామిలీకి స‌రైన హిట్ లేదు. చైత‌న్య‌, అఖిల్ కూడా ఫ్లాప్‌ల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్నారు. అందుకే నాగ్ మ‌ళ్లీ హీరోగా రెచ్చిపోనున్నాడ‌న్న‌మాట‌.