నల్గొండ ఎంపీగా పోటీచేస్తానంటున్నకోమటిరెడ్డి….!

మరో ఏడాదిలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో నల్గొండ ఎంపీగా పోటీచేస్తానని మాజీమంత్రి,కాంగ్రెస్ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ నల్గొండ నుంచి ఉత్సాహవంతమైన యువకుడిని పోటీలో పెట్టి ఎమ్మెల్యేగా గెలిపించుకుంటానని ఆయన అన్నారు.అలాగే ఇటీవల హత్యకు గురైన బొడ్డుపల్లి శ్రీనివాస్ భార్య లక్ష్మీకి రాజకీయాలపై ఆసక్తి లేదని, ఎమ్మెల్యేగా పోటీచేసే ఆలోచన కూడా లేదన్నారు. నా తమ్ముడు రాజగోపాల్‌రెడ్డి వచ్చే ఎన్నికల్లో భువనగిరి నుంచి ఎంపీ బరిలో ఉండొచ్చన్నారు.ఉమ్మడి నల్గొండ జిల్లాలో రెండు ఎంపీ, 12 ఎమ్మెల్యే స్థానాలను గెలిపించుకునేందుకే ఇద్దరం ఎంపీలుగా బరిలోకి దిగుతున్నామని కోమటిరెడ్డి తెలిపారు. కాగా జిల్లాను బ్రష్టుపట్టిస్తున్న మంత్రి జగదీష్‌రెడ్డికి డిపాజిట్ కూడా దక్కదన్నారు.2009 ఎన్నికల్లో గుత్తా సుఖేందర్ రెడ్డికి 2 లక్షల మెజారిటీ వచ్చిందని, 2019లో జరిగే ఎన్నికల్లో నాకు అంతకంటే ఎక్కువ మెజారిటీ ఖాయమన్నారు. టీఆర్ఎస్ పార్టీని గద్దె దించి కాంగ్రెస్‌ను అధికారంలోకి తేవడమే నా ముందున్న ఏకైక లక్ష్యమన్నారు. అందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తానన్నారు.