నాని ఇలా చేస్తాడు అని ఎవ్వరు అనుకోలేదు ..!

నాని వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న షో ‘బిగ్‌బాస్ 2’. ఇప్పటికే సగం భాగాన్ని పూర్తిచేసుకున్న ఈ షో.. రోజురోజుకు ఆసక్తికరంగా, అనూహ్య మలుపులతో ప్రేక్షకులు ఆకట్టుకుంటోంది. ఇక, హౌస్‌లో ప్రధాన పోటీదారుగా మారుతున్న కౌశల్‌కు సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ లభిస్తోంది. అతడి పేరుతో రకరకాల పేజీలు పుట్టుకొస్తున్నాయి.

nani big boss, trendingandhra

కాగా, ఆదివారం బిగ్‌బాస్ పోటీదారులను నాని ఆశ్చర్యపరిచాడు. ఎప్పుడు టీవీ లో కనిపించే నాని ఒక్కసారిగా హౌస్‌లో ప్రత్యక్షమయ్యేసరికి హౌస్‌మేట్స్ ఆశ్చర్యానికి గురైయ్యారు. స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకుని వారికి విషెస్ చెప్పేందుకు నాని ఏకంగా గోడ ఎక్కి మరీ విష్ చేశాడు. కోటు విప్పేసి గోడ ఎక్కి బిగ్‌బాస్ హౌస్ పైకి ఎక్కిన నాని అందరికీ ‘ప్రెండ్‌షిప్ డే’ విషెస్ చెప్పాడు. అతడిని చూసిన హౌస్‌మేట్స్ కిందికి దూకేయాలంటూ గొడవ చేశారు. అందరికి విషెస్ చెప్పిన నాని తరువాత టీవీలో అందరితో మాట్లాడాడు.