నన్ను దోచుకుందువటే…..మూవీ రివ్యూ …!

nannu dochukunduvate , Trending Andhra

తారాగణం : సుధీర్ బాబు, నభా నటేశ్, నాజర్, తులసి తదితరులు..
దర్శకత్వం : ఆర్ ఎస్. నాయుడు
నిర్మాతలు: సుధీర్ బాబు ప్రొడక్షన్స్ బ్యానర్
మ్యూజిక్ : అజనీష్ బి లోకనాథ్
విడుదల తేది : సెప్టెంబర్ 21, 2018

సమ్మోహనంతో తెలుగు ప్రేక్షకుల్ని సమ్మోహనం చేసిన సుధీర్ బాబు హీరోగా, సుధీర్ బాబు ప్రొడక్షన్స్ బ్యానర్ లో ఆర్‌.ఎస్.నాయుడు దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం నన్ను దోచుకుందువటే.. ఈ చిత్ర ఫస్ట్ లుక్ టీజర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ రావడం. సినిమా కాన్సెప్ట్ డిఫరెంట్ గా ఉండడం. హీరో, హీరోయిన్ పెర్ ఫార్మెన్స్ ఫ్రెష్ గా అనిపించడంతో అన్ని వర్గాల ప్రేక్షకులు ఈ సినిమా ఫై ఆసక్తి పెంచుకున్నారు.

వారి ఆసక్తి తగ్గట్లే ఈ చిత్రం ఈరోజు వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి వారి ఆసక్తి తగ్గట్లే సినిమా ఉందా.? అసలు ఈ చిత్ర కథ ఏంటి..? అనేది ఇప్పుడు చూద్దాం.

nannu dochukunduvate movie ,Trending Andhra

కథ :

ఆఫీస్ మొత్తం భయపడే సాఫ్ట్ వేర్ కంపెనీ మేనేజర్ కార్తిక్ ( సుధీర్‌బాబు)..ఇప్పటికైనా అమెరికా వెళ్లాలని కలలుకంటుంటాడు. ఎంతసేపు తన పని ఏంటో తానేంటో తప్ప ప్రేమ, పెళ్లి మీద పెద్దగా ఇంట్రస్ట్ చూపించాడు. ఈ నేపథ్యంలో ఇంట్లో పెళ్లి చేసుకోవాలని ఇబ్బంది పెడుతుంటే తండ్రి (నాజర్ ) కు తాను సిరి అనే అమ్మాయిని ప్రేమిస్తున్నట్లు అబద్దం చెపుతాడు. కార్తీక్ చెప్పిన అబద్దం నిజం అనుకోని ఆయన సిరిని కలుసుకునేందుకు హైదరాబాద్ వస్తాడు.

తండ్రి వస్తున్నాడని తెలియడం తో షార్ట్‌ ఫిలింస్‌లో నటించే ఇంజనీరింగ్‌ స్టూడెంట్‌ మేఘన(నభ నటేష్‌)ను తన గర్ల్‌ ఫ్రెండ్‌గా నటించేందుకు ఒప్పందం చేసుకుంటారు. మేఘన ప్రవర్తన నచ్చి వీరిద్దరికి పెళ్లి చేయాలనీ కార్తీక్ తండ్రి ఫిక్స్ అవుతాడు. ఒప్పదం తో ఒకటైన వీరు నిజ జీవితంలో కూడా ఒకటవ్వాలని అనుకుంటారు. కానీ మేఘనతో ఎక్కువ సమయం గడుపుతుండటంతో కార్తీక్‌కు ఆఫీస్‌లో ఓ సమస్య ఎదురవుతుంది. ఆ సమస్య తో మేఘనను దూరం పెడతాడు కార్తీక్..ఆ తర్వాత ఏం జరుగుతుంది..? కార్తీక్ కు ఎదురైనా సమస్య ఏంటి..? కార్తీక్ అమెరికా కు వెళ్తాడా లేదా..? చివరకు కార్తీక్ , మేఘన కలుసుకుంటారా..లేదా..? అనేది మీరు తెరఫై చూడాల్సిందే.

విశ్లేషణ …!

ఆఫీస్ మొత్తం భయపడే సాఫ్ట్ వేర్ కంపెనీ మేనేజర్ గా సుధీర్‌బాబు తన పాత్రకు పూర్తి న్యాయం చేసారు. తన బాడీ లాంగ్వేజ్‌కు తగ్గ కథను ఎంచుకొని , తన ఇమేజ్‌కు తగ్గట్టుగా రొమాంటిక్‌ కామెడీతో అలరించాడు.ఇప్పటివరకు చూసిన సుధీర్ వేరు..ఈ సినిమాలో చూసిన సుధీర్ వేరు అన్నట్లు ఆయన నటన ఉంది.అల్లరి చేసే గడుసమ్మాయి సిరి పాత్రలో హీరోయిన్ నభా నటేశ్ కనిపించింది. హీరో తండ్రి పాత్రలో నాజర్‌ మరోసారి అదరగొట్టాడు. ముఖ్యం గా తండ్రి కొడుకుల మధ్య ఎమోషనల్‌ సీన్స్‌లో నాజర్‌ నటన కంటతడిపెట్టిస్తుంది.

ఇక వైవా హర్ష మరోసారి ఈ సినిమా తో తన టాలెంట్ ను బయటకు తీసాడు. ఫస్ట్ హాఫ్ లో ఈయన కామెడీ థియేటర్స్ లలో నవ్వులు పోయించింది.తులసి, వేణు, రవి వర్మ, జీవా, వర్షిణి, సౌందర రాజన్, సుదర్శన్ తదితరులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు .
కథనం ఇంకాస్త వేగంగా ఉంటే ఇంకాస్త బాగుండు. ప్రీక్లైమాక్స్‌లో తండ్రి కొడుకుల మధ్య వచ్చే ఎమోషనల్‌ సీన్స్‌ బాగా ఆకట్టుకున్నాయి.

సమ్మోహనం తో ప్రేక్షకులను ఆకట్టుకున్న సుధీర్ బాబు..నన్నుదోచుకుందువటే అంటూ ఓ క్లాసికల్ కథను ఎంచుకొని అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేసాడు. వైవా కామెడీ , హీరో , హీరోయిన్ల లవ్ ట్రాక్ , తండ్రి కొడుకుల ఎమోషనల్ సన్నివేశాలు ఇవ్వన్నీ కూడా ప్రేక్షకులను దోచుకుంటాయి.

ప్లస్ పాయింట్స్ :
వైవ హర్ష కామెడీ
నటి నటుల యాక్టింగ్
కెమెరా వర్క్

మైనస్ పాయింట్స్ :

మాస్ అంశాలు తక్కువగా ఉండడం.
సెకండ్ హాఫ్ నెమ్మదిగా సాగడం.
సంగీతం.

రేటింగ్ : 2/5
రివ్యూ : నన్ను దోచుకుందువటే – మంచి రొమాంటిక్ ఎంటర్టైనర్…….