100 మార్కులు కొట్టేసిన నిధి అగర్వాల్

nidhi agarwal savyasachi news,latest news on savyasachi,savyasachi news,trendingandhra

నిధి అగర్వాల్ సవ్యసాచి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైనది. దీంట్లో చైతూకి జోడి గా సూపర్బ్ గా కనిపించిది.సినిమాలో ఆమె అందాలు స్పెషల్ అట్ట్రాక్షన్గా నిలిచాయి.యూత్ ఐతే నిధి అగర్వాల్ మాయలో పడిపోయారు.ఈ మధ్య కాలంలో తెలుగు సిల్వర్ స్క్రీన్ పై ఇంతటి అందాన్ని చూడలేదు అంటూ మన తెలుగు కుర్రోళ్ళు ఉత్సాహం వ్యక్తం చేస్తున్నారు. సినిమా చూసిన సినీ విశ్లేషకులు కూడా సినిమా సంగతి ఎలా వున్నా ,నిధి అగర్వాల్ మాత్రం అద్భుతం అంటూ నిధిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సరిగ్గా రెండు హిట్లు పడితే నిధి స్టార్ హీరోయిన్ గా టాలీవుడ్ లో ఒక వెలుగు వెలగటం ఖాయం అని సినీ పెద్దలు భావిస్తున్నారు.

చక్కని రూపం , క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో ఇట్టే ఆకట్టుకుంటోన్న ఈ అమ్మాయిని తమ సినిమాలోకి తీసుకోమంటూ కొంతమంది హీరోల వైపు నుంచి దర్శక నిర్మాతలపై వత్తిడి పెరుగుతోందట. దాంతో దర్శక నిర్మాతలు ఈ అమ్మాయి డేట్స్ కోసం గట్టి ప్రయత్నాలే చేస్తున్నారని టాక్. ఇక ఈ అమ్మాయి రెండవ సినిమాగా అఖిల్ ‘మిస్టర్ మజ్ను’ రానుంది. ఆ సినిమా కనుక హిట్ కొట్టిందంటే టాలీవుడ్లో ఈ సుందరి జోరు పెరగడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.