నితిన్ తో వెంకీ నెక్స్ట్ మూవీ……..!

ఇటీవల చలో సినిమాతో విజయాన్ని అందుకున్న దర్శకుడు వెంకీ కుడుములుకు భారీ అవకాశం వచ్చింది.చలో సినిమాతో యూత్ ని బాగా ఆకట్టుకున్న వెంకీ కి హారిక అండ్ హాసిని బ్యానేర్ లో అవకాశంవచ్చిందని టాక్ వినిపిస్తోంది.
నితిన్ కి తగినట్టుగా ఒక కథను సిద్ధం చేయమని వెంకీ కుడుములతో వాళ్లు చెప్పారనేది తాజా సమాచారం. దాంతో అందుకు సంబంధించిన కథపై వెంకీ కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. కథ ఓకే అయితే ఈ బ్యానర్లో నితిన్ కి ఇది రెండవ సినిమా అవుతుంది. గతంలో ఈ బ్యానర్లో వచ్చిన ‘అ ఆ’ ఘన విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజా ప్రాజెక్టుకు సంబంధించిన మిగతా వివరాలు త్వరలో తెలియనున్నాయి.