నోకియా నుండి మరో స్మార్ట్ ఫోన్…..!

నోకియా ఒకప్పుడు మొబైల్ రంగంలో మొదటిస్థానంలో కొనసాగిన సంస్థ.ఇటీవల నోకియా చాల వెనకపడిందనే చెప్పాలి.నోకియా ఇటీవల కొన్ని కొత్త మొబైల్స్ ను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే.మరో మొబైల్ తో ఇప్పుడు నోకియా మనముందుకు వస్తోంది వివరాలలోకి వెళ్తే,

హెచ్‌ఎండీ గ్లోబల్ సంస్థ తన నోకియా 6 స్మార్ట్‌ఫోన్‌ను తాజాగా విడుదల చేసింది. ఇప్పటివరకు ఈ ఫోన్ లో 3జీబీ ర్యామ్ మాత్రమే ఉండేది. అయితే ఇకపై 4జీబీ ర్యామ్ తో కూడా లభించనుంది. 3జీబీ ర్యామ్ ఫోన్ ధర రూ.14,999 ఉండగా, 4జీబీ ర్యామ్ ఫోన్ ధరను రూ.16,999 గా నిర్ణయించారు.

3జీబీ ర్యామ్‌ ఫోన్ లో ఉన్న ఫీచర్లే 4జీబీ ర్యామ్ ఫోన్ లోనూ ఉన్నప్పటికీ, ఇంటర్నల్ స్టోరేజ్ మాత్రం 32 జీబీ నుంచి 64 జీబీకి పెంచారు. అలాగే మెమొరీ కార్డు ద్వారా 128 జీబీ వరకు పెంచుకోవచ్చు. ఫిబ్రవరి 20వ తేదీ నుండి ఫ్లిప్ కార్ట్ లో ఈ ఫోన్ అమ్మకాలు ప్రారంభం అవుతాయి.

నోకియా 6 స్పెసిఫికేషన్ లు :

5.5″ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే

3/4 జీబీ ర్యామ్

32/64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ (128జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్)

ఆండ్రాయిడ్ 7.1 నూగట్ ఆపరేటింగ్ సిస్టం, స్నాప్‌డ్రాగన్ 430 ప్రాసెసర్

బ్యాక్ కెమెరా: 16 మెగాపిక్సల్

ఫ్రంట్ కెమెరా: 8 మెగాపిక్సల్

4జీ వీవో ఎల్‌టీఈ, బ్లూటూత్ 4.1, ఎన్‌ఎఫ్‌సీ, 1080×1920 పిక్సల్స్ రిజల్యూషన్

3000 ఎంఏహెచ్ బ్యాటరీ