బసిరెడ్డి డెడికేషన్ అంటే అదే మరి ……భయపడిన తారక్ ..!

ntr , trendingandhra

అరవింద సమేత’ మంచి సక్సెస్ సాధించింది. ఈ సక్సెస్‌కు ప్రధాన కారకుల్లో ఒకరు జగపతిబాబు. విలన్‌గా ఆయన నటన సినిమాకు అద్భుతంగా కలిసొచ్చింది. అయితే నటన కంటే ఆ సినిమాలో డబ్బింగే చాలా కష్టమైందని జగపతి బాబు తెలిపారు. ఆయన, యంగ్ టైగర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్‌తో కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో జగపతి బాబు డబ్బింగ్ గురించి ఎన్టీఆర్ ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు.

ntr , jagapathi babu , trendingandhra

‘‘నేను ఒకరోజు డబ్బింగ్ థియేటర్‌కు వెళ్లాను. పప్పు అని డబ్బింగ్ ఇన్‌చార్జి నాతో ‘బాబు మీకొకటి చూపించాలి’ అన్నాడు. ఏంటి అన్నాను. వెంటనే ఒక టిష్యూ పేపర్ తీసుకొచ్చి చూపించాడు. దాని మీద చిన్న చిన్న బ్లడ్ డ్రాప్స్ ఉన్నాయి. ఏంటిది పప్పు అన్నా. ‘జగపతిబాబు గారు ఎంత ఇన్వాల్వ్ అయిపోయారంటే బాబు.. దగ్గు వచ్చేసి లోపల ఉన్న రప్చర్ బయటకు వచ్చేసింది’ అని చెప్పాడు. వెంటనే త్రివిక్రమ్‌కి ఫోన్ చేసి… ఆయనకు దగ్గేసి బ్లడ్ వచ్చేస్తుందనుకుంటా. నాకు భయం వేస్తోంది అని చెప్పాను. అది బసిరెడ్డి డెడికేషన్’’ అని తారక్ చెప్పుకొచ్చారు.