ఎన్టీఆర్ బయోపిక్ సినిమాకి దర్శకుడెవరో..?

ఎన్టీఆర్ బయోపిక్ సినిమాకి దర్శకుడెవరో..?

తేజ దర్శకత్వంలో ఎన్టీఆర్ బయోపిక్ రూపొందనుందనీ .. ఎన్టీఆర్ పాత్రను బాలకృష్ణ చేయనున్నాడనే సంగతి తెలిసిందే. ఈ సినిమాను ఎన్టీఆర్ వర్ధంతి రోజైన జనవరి 18న లాంచ్ చేశారు. ఈ పాటికే ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలుకావలసి వుంది. అయితే తేజ..వెంకటేశ్ తో ఒక సినిమా చేస్తూ బిజీగా వున్నాడు. దాంతో ఎన్టీఆర్ బయోపిక్ మరింత ఆలస్యం అవుతుందనే విషయం స్పష్టమవుతోంది.
నందమూరి బాలకృష్ణ.. సిని ఇండస్ట్రీ లో తన నటన తో ఎంతో మంది ప్రేక్షకులను అలరిస్తూ అభిమానులను సంపాదించుకున్నాడు.ఇక ఈ సినిమాకి బాలకృష్ణనే దర్శకత్వం వహించనున్నాడనేది తాజా సమాచారం. ఈ ప్రాజెక్టు పట్ల తేజ అంతగా ఆసక్తిని చూపకపోవడం .. ఆయన ధోరణి పట్ల బాలకృష్ణ అసంతృప్తిగా వున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఇక సమయాన్ని వృథా చేయకూడదనే ఉద్దేశంతో బాలకృష్ణనే దర్శకత్వ బాద్యతలను స్వీకరించాలని నిర్ణయించుకున్నట్టు సిని వర్గాలలో చెప్పుకుంటున్నారు.
ఎన్టీఆర్ పేరు చెప్తే చాలు ఆంధ్ర తెలంగాణాలో ప్రజల కళ్ళలో కలిగే ఆనందమే వేరు అంతటి గొప్ప పేరు ఉన్న
తన తండ్రి సినిమా ఎ విధంగా డైరెక్ట్ చేసి నటిస్తాడో అని సిని అబిమానులందరు ఎదురు చూస్తునారు
అదే జరిగేతే అబిమానులకు పండగే.చూడాలి ఇందులో ఎంతమాత్రం నిజమావుతుందో..!