తలకాయ కోస్తా….. డైలాగ్‌తో దుమ్మురేపుతున్న తారక్ …!

ntr , aravinda sametha dialogue,trendingandhra

‘పులివెందుల పూల అంగళ్ల నుండి కడప కోటిరెడ్డి సర్కిల్ దాక .. కర్నూల్ కొండరెడ్డి బురుజు కాడ్నుంచి అనంతపుర్ క్లోక్ టోవర్ దాంకా.. బల్లారీ గనుల్లో దాంకున్నా.. బెలగావ్ పొలాల్లో పనుకున్నా వదాలా.. తరుముకుంటూ వస్తా తలకాయ్ కోస్తా..’ డైలాగ్ ‘అరవింద సమేత’ చిత్రంలో కీలకమైంది. విలన్‌కి హీరోకి మధ్య జరిగిన ‘పీస్ మీటింగ్’ లో ఎన్టీఆర్ వీర రాఘవుడి అవతారంలో చెప్పిన ఈ డైలాగ్‌కి నందమూరి అభిమానులు థియేటర్స్‌లో విజిల్స్ మోత మోగిస్తున్నారు.

 

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్రేజీ కాంబినేషన్‌లో విడుదలైన ‘అరవింద సమేత’ చిత్రంలోని డైలాగ్‌లలో ‘పీస్ మీటింగ్’ డైలాగ్ సినిమాకే హైలైట్. నిమిషం పాటు సాగిన ఈ పాపులర్ అండ్ పవర్ ఫుల్ డైలాగ్‌ని థియేటర్‌లో చూడలేకపోయిన ప్రేక్షకుల కోసం యూట్యూబ్‌లో విడుదల చేసింది నిర్మాణ సంస్థ హారిక హాసిని క్రియేషన్స్.

NTR, Aravinda Sametha,Trendingandhra

దసరా కానుకగా.. అక్టోబర్ 11న విడుదలైన ఈ మూవీ సంచలన విజయాన్ని నమోదు చేసి రూ. 150 కోట్ల భారీ కలెక్షన్లను రాబట్టింది. ఎన్టీఆర్, పూజా హెగ్డే, నాగబాబు, సునీల్, జగపతిబాబు, ఇషా రెబ్బా తదితరులు నటించిన ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించగా.. హారిక హాసిని బ్యానర్‌లో చినబాబు నిర్మించారు.

#NTRPowerfullDialoguesInAravindaSametha #NTR #AravindaSametha