తారక్ నిజంగా గ్రేట్ భయ్యా….!

Tarak , NTR , TrendingAndhra
ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘అరవింత సమేత’ ప్రీ
రిలీజ్ ఈవెంట్ మంగళవారం ఎంతో అట్టహాసంగా జరిగింది .తారక్ అభిమానులు పెద్ద
ఎత్తున ఈ వేడుకకు తరలివచ్చారు. అభిమానుల కోలాహలంతో వేడుక అత్యంత
ఆకర్షణీయంగా జరిగింది. తండ్రి  హరికృష్ణ మరణం తర్వాత మొదటిసారి ఓ వేడుకకు
హాజరయ్యారు నందమూరి అన్నాదమ్ముళ్లు. తండ్రి లేని లోటు వారి ముఖాల్లో
స్పష్టంగా కనిపించింది.

aravinda sametha pre release event , trendingandhra

ఇక వేదికపై ఎన్టీఆర్ చెప్పిన మాటలు అభిమానుల గుండెలను బరువెక్కించాయి.
వేదికపై కన్నీటి పర్యంతమవుతూ ఎన్టీఆర్ మాట్లాడిన మాటలు అభిమానలోకం
ఏనాటికీ మరచిపోలేరు. ‘‘ఇదివరకు ఏ వేడుక జరిగినా అక్కడ తాత గారి బొమ్మ
చూసేవాడిని.. కానీ ఇంత తొందరలో నాన్న గారి బొమ్మ చూస్తానని అనుకోలేదు’’
అంటూ దుఃఖాన్ని ఆపుకోలేక పోయాడు తారక్. ‘నాన్నా.. అభిమానులు జాగ్ర‌త్త’
అని నాన్నగారు ఎప్పుడూ అంటుండే వారని చెప్పాడు .

NTR ,TrendingAndhra

చివరగా ప్రసంగం ముగించాక కూడా.. తారక్ మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి, ఒక్క
మాట.. ఒక్క మాట అంటూ మైక్ తీసుకొని ‘‘మా నాన్నకు చెప్పలేకపోయినా.. మీ
అందరికీ చెప్తున్నా.. జాగ్రత్తగా ఇంటికి వెళ్లండి. తొందర పడొద్దు. మీ
కోసం మీ కుటుంబం ఉంది. మీకు ముందు మీ కుటుంబం.. ఆ తర్వాతే మేమంతా. దయచేసి
జాగ్రత్తగా ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను ఆప్యాయంగా పలకరించండి’’ అని
ఉద్యేగంతో చెప్పి ముగించాడు. ఈ మాటలు చూసిన ఎవరైనా కూడా తారక్ ని గ్రేట్
అనకుండా ఉండలేరు .