రాజమౌళి పై ఎన్టీఆర్ హాట్ కామెంట్స్ ….షాక్ లో తెలుగు సినీ ఇండస్ట్రీ

 

రాజమౌళి జూనియర్ ల మధ్య సాన్నిహిత్యం కేవలం సినిమాలకు సంబంధించింది మాత్రమే కాకుండా వారిద్దరూ ప్రాణ స్నేహితులు లా కొన్ని దశాబ్దాల నుండి కొనసాగుతున్నారు. ఈసాన్నిహిత్యంతో జూనియర్ రాజమౌళి పై వేసిన సెటైర్ ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది.

ప్రస్తుతం ‘అరవింద సమేత’ సూపర్ సక్సస్ ను ఎంజాయ్ చేస్తూ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ మీడియా ప్రతినిధి జూనియర్ ను త్వరలో ప్రారంభం కాబోతున్న రాజమౌళి ‘ఆర్ ఆర్ ఆర్’ విషయమై ప్రశ్నించినప్పుడు జూనియర్ జక్కన్న పై ఈ సెటైర్ వేసాడు. ‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగ్ కు సంబంధించి రాజమౌళి బందిఖానాలోకి ఎప్పుడు వెళుతున్నారు అని అడిగినప్పుడు జూనియర్ మాట్లాడుతూ తన చిన్న కొడుకు భార్గవ రామ్ స్కూల్ కు వెళ్ళే వయసు వచ్చే దాకా తాను రాజమౌళి ‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగ్ కు బందీగా ఉంటానేమో అంటూ జోక్ చేసాడు.

దీనినిబట్టి చూస్తుంటే రాజమౌళి తీయబోతున్న ‘ఆర్ ఆర్ ఆర్’ మల్టీ స్టారర్ పూర్తి అయ్యే సరికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో జూనియర్ కే తెలియని అయోమయ పరిస్థితి ఏర్పడిందా అన్న సందేహాలు కలగడం సహజం. అందుకే కాబోలు ‘అరవింద సమేత’ హడావిడి తరువాత ఒక నెలరోజులు రెస్ట్ తీసుకోవడానికి ఫారెన్ ట్రిప్ ఆలోచనలు కూడ పక్కకు పెట్టి నవంబర్ నుండి రాజమౌళి ‘ఆర్ ఆర్ ఆర్’ వర్క్ షాప్ కు జూనియర్ రెడీ అవుతున్నాడు.

రాజమౌళి మల్టీ స్టారర్ పై జూనియర్ చేసిన కామెంట్స్ సరదాగా ఉన్నా సినిమా నిర్మాణ విషయంలో రాజమౌళి తన హీరోలను ఏవిధంగా టార్చర్ పెడతాడో జూనియర్ సరదాగా మాట్లాడిన మాటలు బట్టి అర్ధం అవుతుంది. దీనికితోడు ‘బాహుబలి’ తరువాత రాజమౌళి నుండి రాబోతున్న మూవీ కాబట్టి టార్చర్ ఏస్థాయిలో ఉంటుందో ముందుగానే ఊహించుకుని తారక్ రెడీ అవుతున్నాడు అనుకోవాలి..