పడి పడి లేచె మనసు టీజర్ రివ్యూ ….!

padi padi leche manasu , TrendingAndhra

టాలీవుడ్ లో ప్రస్తుతం ప్రేమకథా చిత్రాల స్పెషలిస్టుగా హను రాఘవపూడి గురించి చెప్పుకోకవచ్చు. ఆయన తాజా చిత్రంగా ‘పడి పడి లేచె మనసు’ ని తెరకెక్కిస్తున్నారు . శర్వానంద్ , సాయిపల్లవి జంటగా ఇందులో నటిస్తున్నారు. ఈ సినిమా నుంచి తాజాగా ఒక టీజర్ ను రిలీజ్ చేసారు . హీరో , హీరోయిన్స్ కాంబినేషన్లోని సన్నివేశాలపై ఈ టీజర్ ను కట్ చేశారు.

ఈ సినిమాలో మెడికోగా సాయిపల్లవి కనిపిస్తోంది. శర్వానంద్ ఆమెను ఫాలో చేయడం .. అది గమనించి ఆమె నిలదీయడం ఈ టీజర్ లో చూపించారు. యూత్ ఆశించే ఫీల్ కంటెంట్ లో కనిపిస్తోంది. సినిమాపై వాళ్లలో ఆసక్తిని రేకెత్తించేదిలానే వుంది. ఇటు శర్వానంద్ .. అటు సాయిపల్లవి ఇద్దరూ కూడా విభిన్నమైన కథాంశాలను ఎంచుకునేవారే గనుక, అందరిలోను అంచనాలు పిక్స్ లో వున్నాయి.

ఈ టీజర్‌ ని చూస్తుంటే ఈ చిత్రం ఒక అందమైన ప్రేమకథ గా రూపొందిస్తున్నాడు అని అర్థమౌతుంది . ఈ సినిమాలో సాయి పల్లవి, శర్వానంద్‌ నటన, స్క్రీన్ ప్లే చూస్తుంటే ప్రేక్షకులు ఫిదా అవ్వాలిసిందే. ఈ సినిమా చాల రోజుల నుంచి షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమాను డిసెంబర్‌ 21న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు చిత్ర యూనిట్.