పేపర్ బాయ్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

పేపర్ బాయ్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

పేపర్ బాయ్ మూవీ రివ్యూ  రేటింగ్ :–

విడుదల తేదీ : ఆగష్టు 31, 2018

Trending Andhra రేటింగ్  : 3/5

నటీనటులు : సంతోష్ శోభన్, రియా, తాన్యా , పోసాని కృష్ణ మురళి, బిత్తిరీ సత్తి, విద్యుల్లేక, జయప్రకాష్ రెడ్డి తదితరులు

దర్శకత్వం : జయశంకర్

నిర్మాతలు : సంపత్ నంది, రాములు, వెంకట్, నరసింహ

సంగీతం : బీమ్స్

సినిమాటోగ్రఫర్ : సౌందర్య రాజన్

స్క్రీన్ ప్లే : సంపత్ నంది

ఎడిటర్ : తమ్మి రాజు

సంపత్ నంది టీమ్ వర్క్స్ బ్యానర్లో సంపత్ నంది నిర్మాతగా ప్రచిత్ర క్రియేషన్స్, బి ఎల్ ఎన్ సినిమా సంయుక్తంగా జయశంకర్ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం “పేపర్ బాయ్”. సంతోష్ శోభన్, రియా, తాన్య హోప్ హీరో హీరోయిన్లు గా నటించిన ఈ చిత్రం ఈ రోజు విడుదల అయింది.

కథ :

రవి (సంతోష్ శోభన్) బీటెక్ చదివి ఓవైపు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూనే మరోవైపు పేపర్ బాయ్ గా పని చేస్తుంటాడు. తాను పేపర్ వేసే ఒక పెద్ద కుటుంబానికి చెందిన ధరణి (రియా సుమన్)ని అతను ఇష్టపడతాడు.రవి వ్యక్తిత్వం నచ్చి ఆమె కూడా అతడిని ప్రేమిస్తుంది. ఐతే ఇరువురి నేపథ్యాల్లో అంతరం వీరి ప్రేమకు అడ్డంకిగా మారుతుంది. దీంతో ధరణికి దూరమవ్వాలని రవి అనుకుంటాడు. కానీ ధరణి అతడిని వదులుకోకూడదనుకుంటుంది. ఈ స్థితిలో వీళ్లిద్దరూ మళ్లీ కలిసారా లేదా అన్నది మిగతా కథ.

paper boy

ప్లస్ పాయింట్స్ :

తన కెరీర్ లో హీరోగా రెండో సినిమా చేస్తోన్న సంతోష్ శోభన్ లుక్స్ పరంగా బాగున్నాడు. తన యాక్టింగ్ తో అచ్చం పేపర్ బాయ్ లానే ఆకట్టుకునాడు. ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశంలో సంతోష్ శోభన్ ఎంతో అనుభవం ఉన్న నటుడిలా బాగా చేసాడు.
హీరోయిన్ రియా తన నటనతో ఆకట్టుకుంది. హీరోకి ప్రపోజ్ చేసే సన్నివేశంలో ఆమె నటన బాగుంది. అలాగే మరో హీరోయిన్ గా తాన్యా కూడా తన నటనతో ఆకట్టుకున్నే ప్రయత్నం చేసింది. కొన్ని భావోద్వేగ సన్నివేశాల్లో ఆమె చాలా సెటిల్డ్ గా నటించి మెప్పించింది.

హీరో ఫ్రెండ్స్ గా నటించిన మహేష్ విట్టా, హీరోయిన్ ఫ్రెండ్ గా చేసిన విద్ద్యుల్లేఖ, ఆమె లవర్ గా నటించిన బిత్తరి సత్తి బాగా నవ్వించారు.
క్లైమాక్స్ సీక్వెన్స్ కూడా బాగున్నాయి ముఖ్యంగా కనిపించకుండా పోయిన హీరో కోసం హీరోయిన్ వెతికే సీక్వెన్స్.హీరో హీరోయిన్లను కలపడం ఆకట్టుకుంటుంది.

Paper Boy review

మైనస్ పాయింట్స్:

సినిమా అక్కడక్కడ సరదాగా సాగిన, ఓవరాల్ గా నెమ్మదిగా సాగుతూ బోర్ కొట్టిస్తోంది. దానికి తోడు కొన్ని సన్నివేశాల్లో మరీ నాటకీయత గా అనిపిస్తుంది. దర్శక రచయితలూ లవ్ స్టోరీని మంచి ఎమోషనల్ గా కనెక్ట్ చేసే ప్రయత్నం చేసినప్పటికీ ఆ లవ్ స్టోరీ అంతగా కనెక్ట్ కాము.
ఈ రెగ్యూలర్ లవ్ స్టోరీలో మంచి భావోద్వేగాన్ని పండించే సన్నివేశాలు ఉన్నా, ఎక్కడా హృదయానికి హత్తుకున్నే విధంగా ఉండవు. పైగా చాలా చోట్ల సినిమాటెక్ గానే సాగుతాయి. ఒక్క క్లైమాక్స్ మినహా మిగతా స్క్రీన్ ప్లే కూడా చాలా ప్రెడిక్టుబుల్ గా నడుస్తుంది.

సాంకేతిక విభాగం:
భీమ్స్ సంగీతం బాగుంది. రెండు మూడు పాటలు బాగున్నాయి . బ్యాక్ గ్రౌండ్ సంగీతం కొన్ని చోట్ల మరీ హెవీ అనిపించినప్పటికీ.. ఓవరాల్ గా సినిమాకు బాగానే ఉపయోగపడింది. సౌందర్ రాజన్ కెమెరా పనితనం మరో ఆకర్షణ. విజువల్స్ ఆద్యంతం ఆకట్టుకుంటాయి. నిర్మాణ విలువలు ఉన్నంతలో బాగున్నాయి. రచయిత సంపత్ నంది డైలాగుల వరకు మాత్రమే మెప్పించాడు. అతను ఎంచుకున్న కథలో బలం లేదు. స్క్రీన్ ప్లే కూడా మామూలుగానే అనిపిస్తుంది. దర్శకుడు జయశంకర్ అక్కడక్కడా పనితనం చూపించాడు. కానీ బలహీనమైన స్క్రిప్టుతో అతను కూడా ఏమీ చేయలేకపోయాడు

Santosh Shoban

తీర్పు:

దర్శకుడు సంపత్ నంది కథను ఇంకా ఆసక్తికరంగా రాసుకొని ఉండి ఉంటే ఈ చిత్రం ఓ మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా అయి ఉండేది.కాగా హీరో హీరోయిన్ల ప్రేమ కథ, ఇద్దరి మధ్య సాగే కొన్ని సన్నివేశాలు బాగున్నప్పటికీ, చాలా చోట్ల సినిమాని సాగదీశారనిపిస్తుంది.వాటికి తోడు నెమ్మదిగా సాగే కథనం, బలమైన భావోద్వేగాలు పండించే సన్నివేశాలు ఉన్నా, అవి సరిగ్గా ఎలివేట్ కాకపోవడం, కొన్ని సీన్స్ కన్వీన్స్ గా అనిపించకపోవడం లాంటి కారణాలతో సినిమా ఆసక్తికరంగా సాగదు. ఓవరాల్ గా ఓ ఎమోషనల్ లవ్ స్టోరీతో వచ్చిన ఈ సినిమా పూర్తిగా ఆకట్టుకొన్నే విధంగా లేదు.