అజ్ఞ్యాతవాసి సృష్టించిన మరో రికార్డ్…….ఆ రికార్డ్ ఏంటో తెలుసా ..!

pawan kalyan , agnathavasi , trendingandhra

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రాలలో అతి ఘోర పరాజయ చిత్రాలలో అజ్ఞ్యాతవాసి మొదటిస్థానం లో నిలిచింది  . అప్పటికే త్రివిక్రంతో ఒక హిట్టు ఒక ఇండస్ట్రీ హిట్ కొట్టిన తర్వాత వీరిద్దరి కాంబో లో  వచ్చిన చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.అయితే ఎన్ని అంచనాలతో అయితే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చిందో,అంతే స్థాయిలో భారీ ప్లాప్ గా నిలిచిపోయింది.

agnathavasi , TrendingAndhra

ఇక ఆ తర్వాత కూడా పవన్ సినిమాలు మానేసి పూర్తి స్థాయి రాజకీయాల్లో దిగిపోయారు.పవన్ క్రేజ్ తో మొదటి రోజు రికార్డు కలెక్షన్ సాధించిన సినిమా ఊహించిన స్థాయిలో వసూళ్లను రాబట్టకపోయినా సరే ఇప్పుడు మాత్రం మన దక్షిణ భారతదేశ చిత్రాల్లోనే నెంబర్ 1 గా నిలిచింది. అదేంటి ఈ చిత్రం ఇప్పుడు తాజాగా ఏం రికార్డు కొట్టిందా అనుకుంటున్నారా?మన తెలుగు సినిమాలను హిందీ వారు తీసుకొని వాటిని హిందీ భాషలోకి డబ్ చేసి వదులుతారు.

Pawan Klayan, trendingandhra

అదే స్థాయిలో మన తెలుగు చిత్రాలు వందల మిలియన్ వ్యూస్ ని కూడా సంపాదించుకుంటాయి.అదే తరహాలో “అజ్ఞ్యాతవాసి” చిత్రాన్ని కూడా హిందీ లో “ఎవడు 3” గా డబ్ చేసి యూట్యూబ్ లో పెట్టగా కేవలం 24 గంటల్లో 9.6 మిలియన్(96 లక్షల) వ్యూస్ సంపాదించుకొని మన దక్షిణ భారతదేశంలోని ఏ చిత్రానికి దక్కని రికార్డుని సొంతం చేసుకుంది.మన దగ్గర ప్లాప్ అయిన చిత్రాలు అక్కడ మిలియన్ వ్యూస్ సంపాదించుకోవడం ఇప్పుడు కొత్తేమి కాదు.రామ్ చరణ్ యొక్క ఆరెంజ్,నితిన్ లై చిత్రాలు కూడా అక్కడ మిలియన్ వ్యూస్ సంపాదించుకున్నాయి.కానీ ఒక్క రోజులో ఇన్ని వ్యూస్ అయితే మాత్రం పవన్ కు మాత్రమే దక్కింది .

#PawanKalyanAgnathavasiCreatesANewRecord #PawanKalyan #AgnathavasiMovie