నిరుద్యోగ భృతి పై పవన్ సెటైర్ ….!

Pawan Kalyan , TrendingAndhra

వాడుకుని వదిలేసే రాజకీయ వ్యవస్ధకు బుద్ధి చెప్పాలి.. బలమైన రాజకీయ వ్యవస్థ కోసమే రాజకీయాల్లోకి వచ్చానని జనసేనాని పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యానించారు. జంగారెడ్డిగూడెం ఏలూరు ప్రధాన రహదారిలో మంగళవారం సాయంత్రం పవన్‌ కల్యాణ్‌ బహిరంగ సభలో స్థానిక సమస్యలను ప్రస్తావించారు. ముఖ్యమంత్రి కుమారుడు లోకేష్‌ రాష్ట్రంలో 14 వేల కిలోమీటర్ల రోడ్డు నిర్మించామంటున్నారు. ఏజెన్సీ, మెట్ట ప్రాంతంలోని జంగారెడ్డిగూడెం రహదారులను చూడండి. ఇక్కడ రహదారులు దారుణంగా ఉన్నాయి. 14 వేల కిలోమీటర్‌ల రోడ్లు ఎక్కడ వేశారు..  తెలుగుదేశం ప్రభుత్వంపై తీవ్రస్ధాయిలో ధ్వజమెత్తారు.

Pawan Kalyan , Trendingandhra

యువతకు పాకెట్‌ మనీ ఇస్తామంటున్న ప్రభుత్వం మహిళలను విస్మరించడం తగదన్నారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలే తప్ప పాకెట్‌ మనీ ఎందుకని నిరుద్యోగభృతిని ఉద్దేశించి ప్రస్తావించారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రాష్ట్రంలో కరువయ్యాయన్నారు. మహిళలతో విజయవాడ కేంద్రంగా సమావేశం ఏర్పాటుచేసి ప్రభుత్వానికి సమస్యలను తెలియజేస్తామని పవన్‌ పేర్కొన్నారు.