లోకేష్ నీకన్నా కేటీఆర్ బెస్ట్ …పవన్ వ్యాఖ్యలు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి టీడీపీ మంత్రి , సీఎం తనయుడిపై తీవ్రమైన వ్యాఖ్యలతో విరుచుకుపడ్డాడు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ప్రజానాయకుడు కావాలంటే ప్రజా క్షేత్రం లో గెలిచి పాలనా చేయాలనీ చెప్పాడు. రాజకీయాల్లో జవాబుదారీతనం ఉండాలి అని అన్నారు. తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు పోరాటం చేసిన అనుభవం ఉంది. ఆయన ప్రజల్లో గెలిచారు. లోకేశ్‌కు ముఖ్యమంత్రి అయ్యే అనుభవం ఎక్కడ ఉంది, వాళ్ల తాత 60 ఏళ్లు దాటాక రాజకీయాల్లోకి వచ్చారు అని పవన్ అన్నారు.

బుధవారం ప్రశాసన్‌నగర్‌, మాదాపూర్‌లోని జనసేన కార్యాలయాల్లో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అవినీతికి, చిన్నారులపై అకృత్యాలకు పాల్పడేవారిని, మహిళలకు రక్షణ ఇవ్వని వారిని తమ పార్టీ శత్రువులుగా భావిస్తుందన్నారు. తనకు వేల కోట్లు సంపాదించాలని, వారసులను అధికారంలోకి తేవాలన్న ఆశలు లేవన్నారు. జనసేనలోకి కొత్త నాయకత్వాన్ని తీసుకొస్తామన్నారు.

ముస్లింలను మైనారిటీలుగా పిలవడం తనకు నచ్చదని, వాళ్లూ భారతీయులే అని, వాళ్లకూ అందరితోపాటు సమాన హక్కులున్నాయన్నారు. కాగా, తెలంగాణపై తనకు పిచ్చిప్రేమ అని, ఇక్కడ జనసేనను దశల వారీగా ముందుకు తీసుకెళ్తామని పవన్‌ కల్యాణ్‌ చెప్పారు. తెలంగాణలో పార్టీకి బలం ఉన్న చోట పోటీ చేస్తామని, మిగతా చోట్ల ప్రభావితం చేస్తామన్నారు.