పవన్ పోటీ చెయ్యనని యూటర్న్ తీసుకుంది అందుకేనా

janasena,janasena party,pawan kalyan,power star pawan kalyan,pawan kalyan take u turn for janasena reason is that,trendingandhra

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిన తొలి నాళ్ళల్లో తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ పార్టీ ప్రభంజనం కొనసాగుతుందని భావించారు. కానీ పవన్ పార్టీ ప్రస్తుతానికి ఏపీ కే పరిమితం అయ్యింది.
జనసేన పార్టీని హైదరాబాద్ నుండి ఆపరేట్ చేస్తున్న పవన్ కళ్యాణ్ మొదట్లో తెలంగాణ రాజకీయాల్లో కూడ చక్రం తిప్పాలని అనుకున్నారు. కానీ అది సాధ్యం కాలేదు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తామని చెప్పినా ఇప్పుడు ఒక్క స్థానంలో కూడా పోటీ చెయ్యకుండా సైలెంట్ అయ్యారు.
మొదట తెలంగాణలో ఈసారి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు జనసేనాని పవన్ కళ్యాణ్. ఆ తర్వాత కొన్నాళ్ళకు పార్టీ నిర్మాణం పూర్తికానందున ఈసారికి కొన్ని స్థానాలకు మాత్రమే పరిమితమవుతామని చెప్పారు. ఇప్పుడేమో మొత్తానికి పోటీ నుండి వైదొలిగారు. అయితే పవన్ తీసుకున్న ఈ నిర్ణయానికి చాలా బలమైన కారణం ఉంది.
తెలంగాణలో జనసేన పార్టీ కి సరైన సంస్థాగత నిర్మాణం లేదు.ఒక్కరంటే ఒక్కరు కూడా బలమైన నాయకులు లేరు. ఉన్న కొద్దిపాటి క్యాడర్ (అది కూడా ఆయన ఫ్యాన్స్) కు దిశా నిర్దేశం చేసే న్యాయకత్వం లేదు. అదీ కాక ఎన్నికలు ఊహించని విధంగా ముందస్తుగా వచ్చాయి.ఈ క్లిష్ట పరిస్థితుల్లో పార్టీ ఎన్నికలకు సిద్దమవడం పోటీ చెయ్యటం అంటే అది అసాధ్యం అని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. అందుకే తెలంగాణా ఎన్నికలకు కామ్ గా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు.
ఒకవేళ పోటీ చేసి ఓటమి పాలైతే ఆ ఫలితం రాబోయే, ప్రధాన లక్ష్యమైన ఏపీ ఎన్నికలపై ఖచ్చితంగా పడుతుంది. కాబట్టి ఊరుకున్న దాని కన్నా ఉత్తమం లేదని భావించి జనసేనాని సరైన నిరనయమే తీసుకున్నారు. ఇన్ని ఇబ్బందులున్నప్పుడు పోటీ చేయకపోవడమే మంచిదని, ఏపీ ఎన్నికలే టార్గెట్ గా ఈ సారికి ముందుకు సాగితే మంచిదని పవన్ తీసుకున్న నిర్ణయం పవన్ పార్టీ కి మేలు చేసే అంశం. 

#Janasena  #JanasenaParty #PawanKalyan #PowerStarPawanKalyan #PawanKalyanTakeUTurnForJanasenaReasonIsThat