విజయసాయిరెడ్డికి పోలీస్ అధికారులు వార్నింగ్ ఇచ్చింది అందుకేనా

vijay sai reddy , trendingandhra

వైసీపీలో జగన్ తర్వాత కీలక నాయకుడు విజయ సాయి రెడ్డి కి పోలీస్ అధికారులు వార్నింగ్ ఇచ్చారు. జగన్ పై జరిగిన దాడి విషయం లో విజయ సాయి రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు పోలీస్ అధికారులు స్పందించారు. అడ్డగోలు గా మాట్లాడితే వూరుకోమంటూ హెచ్చరించారు.
జగన్ పై దాడి కేసు పలు కీలక మలుపులు తిరుగుతున్న నేపధ్యంలో ఆ దాడికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని,ఆ దాడి చేయించింది టీడీపీ నే అని చెప్పి దాడి ఘటనపై రాదాంతం చేస్తున్నారు వైసీపీ నేతలు. అటు టీడీపీ నాయకులు సైతం మాటల యుద్ధానికి దిగారు.

vijay sai reddy , trendingandhra

టీడీపీకి జగన్ మీద దాడి చేయించే అవసరం లేదని, ఇంత కాలం పాదయాత్రలు చేస్తున్న జగన్ మెడ ఎప్పుడూ జరగని దాడి ఇప్పుడు ఎందుకు జరిగింది అని ప్రశ్నించారు. విశాఖ ఎయిర్ పోర్ట్ లో అదీ కేంద్రం అధీనంలో ఉన్న చోట జరిగితే టీడీపీని టార్గెట్ చేసి అల్లర్లకు పాల్పడాలని చూస్తే ఊరుకోమని మండిపడ్డారు. ఇలా వై సీపీలో టీడీపీలో వరల్డ్ వార్ లాగా వర్డ్ వార్ జరుగుతుంటే వైసీపీ లో జగన్ తర్వాత ఆయనే అని చెప్పుకునే విజయసాయి రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి డీజీపీ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు.రాష్ట్ర డీజీపీని కించ‌ప‌రుస్తూ వైసీపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు విజయ సాయిరెడ్డి చాలా దారుణమైన వ్యాఖ్య‌లు చేశారు.. డీజీపీ అధికార పార్టీకి తొత్తుగా మారాల‌ని, చంద్ర‌బాబు ఏది చెబితే అది చేస్తున్నార‌ని విమ‌ర్శించారు . డీజీపీ ఐపీఎస్ కాపీ కొట్టి పాస‌య్యార‌ని నోటికొచ్చింది మాట్లాడారు విజయ సాయి రెడ్డి.

విజయ సాయి చేసిన వ్యాఖ్యలను పోలీస్ అధికారుల సంఘం సీరియస్ గా తీసుకుంది. ఈ విమ‌ర్శ‌ల‌ను ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌ అధికారుల సంఘం ప్రెస్ మీట్ పెట్టి మరీ ఫైర్ అయ్యింది. విజయసాయి రెడ్డి నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని,కేంద్ర బలగాల భద్రతా వలయంలో ఉన్న ఎయిర్‌పోర్టులో జగన్‌పై దాడి జరిగితే రాష్ట్ర పోలీసులను నిందించడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు పోలీస్ అధికారులు . ఇక డీజీపీని ఐపీఎస్‌ కాపీ కొట్టి పాసయ్యావా అన్న విజయసాయి వ్యాఖ్యలకు సమాధానంగా ఠాకూర్‌ ఐపీఎస్‌ రాస్తున్న సమయంలో విజయసాయిరెడ్డి చీటీలు అందించారా? అని ప్రశ్నించారు. కాపీలు కొట్టటం బాగా తెలిసిన విజయసాయిరెడ్డి కూడా కాపీలు కొట్టే సీఏ పాసై ఉంటారన్న పోలీస్ అధికారులు అధికారుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోమని హెచ్చరించారు.