పబ్లిసిటీ కోసం జగన్ పై అభిమాని దాడి చేశాడన్న ఏపీ డీజీపీ

jagan , ys jagan , trendingandhra

ఏపీ ప్రతిపక్ష నేత జగన్ పై శ్రీనివాసరావు అనే వ్యతి కట్టి తో దాడి చేసిన ఘటన ఏపీలో సంచలనం కలిగించింది. ఏపీలో కలకలం రేగింది. అయితే జగన్ పై దాడి విషయంలో స్పందించారు ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్.

RP thakur , trendingandhra

వైఎస్ జగన్‌పై విశాఖలో జరిగిన దాడిని ఖండించారు ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఆర్పీ ఠాకూర్. మీడియాతో మాట్లాడిన ఆయన నిందితుడు శ్రీనివాస్ వైఎస్ జగన్‌కు వీరాభిమాని అని.. పబ్లిసిటీ కోసమే దాడికి పాల్పడ్డాడని అన్నారు.. ఎస్ఎస్ఎఫ్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని డీజీపీ తెలిపారు. నిందితుడి జేబులో ఓ లేఖ ఉందని.. దీనిపై విచారిస్తున్నామన్నారు. దాడి ఘటనపై లోతుగా దర్యాప్తు చేస్తున్నామన్నారు.ఎయిర్‌పోర్ట్‌లోకి కత్తి ఎలా వెళ్లిందనే దానిపై దర్యాప్తు చేస్తున్నామని.. అయితే విమానాశ్రయ భద్రత సీఐఎస్ఎఫ్‌దేనని ఆర్పీ ఠాకూర్ స్పష్టం చేశారు. ఇంతకీ నిందితుడి జేబులో ఉన్న లేఖలో ఏమి రాసి వుంది అనేది ఇప్పుడు తెలియాల్సి వుంది. నిందితుడు పబ్లిసిటీ కోసమే ఆ పని చేశాడా అన్నది మాత్రం నమ్మశక్యం కాని విషయంగా కనిపిస్తుంది.

#APDGPDeclaredReasonsBehindAttackonJagan #RPThakur