లోకసభ సీట్లలో సీన్ రివర్స్… చంద్రబాబుకు భారీ దెబ్బ..జగన్ కి జై కొట్టిన ఏపీ ప్రజలు …తాజా సర్వే ..!

AP , Survey , AP Survey , TrendingAndhra
ఇప్పటికి ఇప్పుడు ఎన్నికలు జరిగితే దేశంలో ఏ పార్టీకి మెజార్టీ వస్తుంది,ఎవరు ప్రధాని అవుతారని తెలుసుకునేందుకు ఏబీపీ – సీ ఓటరు సంయుక్తంగా దేశ్ గా మూడ్ పేరుతో సర్వే చేసింది. ఈ సర్వేలో బీజేపీకి సీట్లు తగ్గినా నరేంద్ర మోడీ మళ్లీ ప్రధానమంత్రి అవుతాడని వెల్లడైంది.

ప్రధానమంత్రిగా కూడా ఎక్కువ మంది మోడీనే కోరుకుంటున్నారు. రాహుల్ గాంధీ సహా ఎవరూ ఆయనకు అందనంత దూరంలో ఉన్నారు. ఈ విషయాన్ని పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలోను ఏబీపీ – సీ ఓటరు సర్వే చేసింది. ఈ రెండు రాష్ట్రాల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితిలు ఎక్కువ సీట్లు పొందనున్నాయని తేలింది.

 ఏబీపీ – సీ ఓటరు సర్వే ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హవా కనిపించనుంది. వైయస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని ఈ పార్టీ
ఏకంగా 21 లోకసభ స్థానాల్లో విజయం సాధించనుందని తేలింది. గత ఎన్నికల్లో వైసీపీ తక్కువ స్థానాల్లో గెలవగా, టీడీపీ ఎక్కువ స్థానాల్లో గెలిచింది. ఆ తర్వాత పలువురు వైసీపీ నేతలు టీడీపీలో చేరారు. కానీ ఈసారి ఏపీలోని 25 అసెంబ్లీ స్థానాలకు గాను జగన్ పార్టీయే ఏకంగా 21 స్థానాలు గెలుచుకుంటుందని తేలింది. తెలుగుదేశం పార్టీ కేవలం 4 సీట్లకే పరిమితం అవుతుందట.

ఏపీబీ – సీ ఓటరు సర్వేలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల ప్రభావం లేదని తేలింది. గత ఎన్నికల్లో కంటే కాంగ్రెస్ పుంజుకున్నప్పటికీ, అలాగే బీజేపీ గత ఎన్నికల్లో రెండు స్థానాల్లో గెలిచినప్పటికీ ఈసారి ఈ పార్టీలు సీట్లు గెలుచుకునే అవకాశాలు కనిపించడం లేదని సర్వేలో తేలింది. ఇక జనసేన పూర్తిగా రంగంలోకి దిగలేదు.