ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన బాలకృష్ణ…..!

balakrishna , elections , trendingandhra
 
తెలుగుజాతి  కీర్తి, ప్రతిష్ఠలను ప్రపంచ నలుమూలలకు చాటిన మహనీయుడు దివంగత ఎన్టీఆర్ అని సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చెప్పుకొచ్చారు . తెలంగాణ అభివృద్ధి కోసం ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడులు ఎంతో కృషి చేశారని చెప్పారు. తెలంగాణ అభివృద్ధి తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని చెప్పారు. ఈరోజు ఖమ్మం జిల్లా మధిరలో ఎన్నికల ప్రచారంలో బాలయ్య పాల్గొన్నారు. 
 
balakrishna,election campaign , trendingandhra
 
ఈ సందర్భంగా ఏపీ, తెలంగాణ సరిహద్దు గ్రామమైన జొన్నలగడ్డ నుంచి టీడీపీ అభిమానులు, కార్యకర్తలు వందలాది మోటార్ సైకిళ్లతో బాలయ్యకు ఘన స్వాగతం పలికారు. రాయపట్నం గ్రామంలోని ఎన్టీఆర్, అంబేద్కర్ విగ్రహాలకు బాలయ్య పూలమాలలు వేసి, నివాళి అర్పించారు. ఆ తర్వాత దెందుకూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన ఎన్టీఆర్ భారీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ, పైవ్యాఖ్యలు చేశారు.
 
l ramana , trendingandhra
 
 
ఈ సందర్భంగా టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ మాట్లాడుతూ, తెలంగాణ అసెంబ్లీలో మహాకూటమి జెండా ఎగరడం ఖాయమని చెప్పారు. మహాకూటమి తొలి గెలుపు మధిర స్థానం నుంచే వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి నామా నాగేశ్వరరావు, స్వర్ణకుమారి తదితరులు కూడా హాజరయ్యారు.